Allu Aravind: “రామాయణం” కథ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.. అల్లు అరవింద్!
టాలీవుడ్ నెంబర్ వన్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.. గీత ఆర్ట్స్ పథకంపై ఎన్నో అద్భుతమైన సినిమాలను వెండితెరకు అందించాడు.కాగా ఇటీవల అలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఒక టాక్ షోకు ఈ నిర్మాత అతిధిగా వచ్చాడు. ఈ నేపథ్యంలో తనని అలీ..

Allu Aravind Confirms Ramayanam Story with Ram Charan
Allu Aravind: టాలీవుడ్ నెంబర్ వన్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.. గీత ఆర్ట్స్ పథకంపై ఎన్నో అద్భుతమైన సినిమాలను వెండితెరకు అందించడమే కాకుండా, తాజాగా గీత ఆర్ట్స్-2 ప్రారంభించి చిన్న దర్శకులను ప్రోత్సహిస్తూ, చిన్న సినిమాలతో అదిరిపోయే హిట్టులు అందుకుంటూ విజయవంతమైన నిర్మాతగా ముందుకు దోసుకుపోతున్నాడు.
Allu Aravind: “చరణ్-అర్జున్” టైటిల్ తో భారీ మల్టీస్టారర్.. అల్లు అరవింద్ ప్రకటన!
కాగా ఇటీవల అలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఒక టాక్ షోకు ఈ నిర్మాత అతిధిగా వచ్చాడు. ఈ నేపథ్యంలో తనని అలీ.. “నేను ఎప్పటి నుంచో వింటున్నా, మీరు మరో ఇద్దరు నిర్మాతలు కలిసి “రామాయణం” తెరకెక్కిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అవి నిజమేనా?” అని ప్రశ్నించగా, నిర్మాత అల్లు అరవింద్ బదులిచ్చాడు.
“నేను ఎక్కువగా ఆ విషయాలను బయటపెట్టలేను కానీ, ఆ వార్తలు నిజమే. గత 4 ఏళ్లగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకటిన్నర సంవత్సరం నుంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది, మరో ఆరు నెలలు పాటు కూడా జరగనుంది. వచ్చే ఏడాది నుంచి సెట్స్ పైకి వెళుతుంది” అంటూ వెల్లడించాడు. అయితే గతంలో రాంచరణ్ ని రాముడిగా పెట్టి రామాయణం తీయబోతున్నట్లు ఈ నిర్మాత ప్రకటించిన విషయం తెలిసిందే.