Balakrishna-Vashist : అబ్బాయ్ డైరెక్టర్‌తో బాబాయ్..
‘అన్‌స్టాపబుల్’ అంటూ బాలయ్య బాబు హోస్ట్‌గా అదిరిపోయే టాక్ షో తో సెన్సేషన్ క్రియేట్ చేసిన అల్లు అరవింద్.. ఇప్పుడు ఓ క్రేజీ ప్రాజెక్ట్ ఫిక్స్ చేశారు..

Balakrishna Vashist
Balakrishna-Vashist: నటసింహా నందమూరి బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ షోతో మీడియా అండ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశారు. బాలయ్య హోస్ట్, అదీ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ అనగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కట్ చేస్తే, ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమోతో వాటిని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లి కూర్చోబెట్టారు. ఫిబ్రవరి 4న మహేష్ బాబు ఎపిసోడ్‌తో ఫస్ట్ సీజన్ కంప్లీట్ కానుంది.
Unstoppable with NBK : బాలయ్య దెబ్బకి ‘థింకింగ్’ మారిపోతుందని ముందే చెప్పాం-‘ఆహా’ టీం
అనుకున్నదానికి మించి షో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. హోస్టింగ్ కొత్త అయినా ఓటీటీలోనూ తన స్టైల్లో అదరగొట్టేశారు బాలయ్య. సెలబ్రిటీలతో కలిసి సందడి చేస్తూ.. వారిని సరదా ప్రశ్నలడుగుతూనే ఎమోషనల్‌గా ఆకట్టుకున్నారు. ఈ షో IMDB రేటింగ్స్‌లో 9.7 రేటింగ్‌తో టాక్ షోస్‌లో దేశంలోనే నెం.1 ప్లేస్ సాధించిన సంగతి తెలిసిందే.
Akhanda Hotel : ‘అఖండ’ అభిమానం.. ఆరగించిపోండి..
బాలయ్య ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. బాలయ్యతో డిజిటల్ ఎంట్రీకి శ్రీకారం చుట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఇప్పుడు ఏకంగా ఆయనతో సినిమానే ప్లాన్ చేశారు. ‘బన్నీ’, ‘భగీరథ’ సినిమాలను నిర్మించిన మల్లిడి సత్యనారాయణ రెడ్డి కొడుకు మల్లిడి వశిష్ట్ రెడ్డి బాలయ్యను డైరెక్ట్ చెయ్యబోతున్నాడు. గీత ఆర్ట్స్ బ్యానర్‌లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కబోతుంది. రీసెంట్‌గా వశిష్ట్‌కి అరవింద్ అడ్వాన్స్ ఇచ్చారు. ఈ ప్రెస్టీజియస్ ఫిలిం గురించిన వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో సెన్సేషన్ అయ్యింది.
NBK 107 : బాబు రెడీ బాబు.. ఈసారి నాలుగు భాషల్లో!
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో ‘బింబిసార’ అనే భారీ బడ్జెట్ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు వశిష్ట్. పోస్టర్స్, టీజర్ సినిమా మీద అంచనాలు పెంచేసాయి. ఇప్పుడు బాలయ్యని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు. త్వరలో ఈ ప్రాజెక్టుకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వనున్నారు.