Allu Aravind : అల్లు అర్జున్ తరపున హాస్పిటల్ కు అల్లు అరవింద్.. బన్నీ బాధపడుతూ మీరైనా వెళ్లండి డాడీ అన్నాడు..
తాజాగా అల్లు అరవింద్ కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ ని చూడటానికి వెళ్లారు.

Allu Aravind Visited Hospital for Sree Tej
Allu Aravind : సంధ్య థియేటర్ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా ఆమె కొడుకు శ్రీతేజ్ మాత్రం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఆ కుటుంబానికి అల్లు అర్జున్ 25 లక్షల సాయం ప్రకటించాడు. ఆ బాబు వైద్య చికిత్సకు కావాల్సిన ఖర్చులు పెట్టుకుంటాను అని, ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని ప్రకటించాడు.
అయితే హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాలుడిని చూసేందుకు అల్లు అర్జున్ వెల్దామనుకున్నా సెక్యూరిటీ కారణాలతో, కోర్టు కేసుతో వెళ్ళలేదు. దీంతో తాజాగా అల్లు అరవింద్ కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ ని చూడటానికి వెళ్లారు. శ్రీ తేజ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితి గురించి అక్కడి డాక్టర్స్ తో మాట్లాడి తెలుసుకున్నారు.
Also Read : Prasad Behara : యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్.. నటితో అసభ్యంగా ప్రవర్తించడంతో..
అనంతరం అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడుతూ.. హస్పటల్‌లో ఉన్న శ్రీతేజ్‌ను ఐసీయూలో చూశాను. డాక్టర్స్ అందరితో మాట్లాడాను. అబ్బాయి రోజు రోజుకి రికవరీ అవుతున్నాడు. గత 10 రోజుల్లో రికవరీ బాగా కనిపిస్తుంది కానీ కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని డాక్టర్స్ చెప్పారు. శ్రీతేజ్ కోలుకోవడానికి మేము ఏం చేయడానికి అయినా సిద్దంగా ఉన్నాం. ప్రభుత్వం కూడా శ్రీతేజ్‌ను సంపూర్ణ ఆరోగ్యంగా చూడటానికి రెడీగా ఉన్నాం అని చెప్పడం అభినందనీయం. చాలా మంది అభిమానులు, బందువులు, మిత్రులు అల్లు అర్జున్ ఎందుకు హస్పటల్‌కు వెళ్లలేదు అని అడుగుతున్నారు. తొక్కిసలాట జరిగిన మరుసటి రోజు ఉదయమే అర్జున్ హస్పటల్‌కు వెళ్లదామనుకున్నాడు. కానీ హస్పటల్ అధికారులు నిన్నే కదా ఈ సంఘటన జరిగింది. మీరు హస్పటల్‌కు వచ్చే కార్యక్రమం వాయిదా వేసుకోమని అన్నారు. కరెక్ట్ అనిపించింది. అందుకే రాలేదు. ఆ రోజే అర్జున్‌పై కేసు వచ్చింది. ఆ కేసు లీగల్ టీమ్ హెడ్ నిరంజన్ రెడ్డి గారు కూడా హస్పటల్‌కు వెళ్లకూడదు, వారిని కలవకూడదు అని చెప్పారు. ఆ తరువాత మేము రావడానికి ఎన్నో నిబంధనలు ఉన్నాయి. బన్నీ బాధపడుతూ మీరైనా వెళ్లండి డాడీ అన్నాడు. అందుకే నేను తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ తీసుకొని అర్జున్ తరపున ఇక్కడికి వచ్చాను అని తెలిపారు.