Allu Arjun : అల్లు అర్జున్ AAA థియేటర్ ఓపెన్.. మొదటి సినిమాగా ఆదిపురుష్.. టికెట్ బుకింగ్స్ ఓపెన్..

హైదరాబాద్ అమీర్‌పేట్‌లో అల్లు అర్జున్ AAA థియేటర్ నేడు ఓపెన్ అయ్యింది. మొదటి సినిమాగా ప్రభాస్ ఆదిపురుష్ సినిమా. టికెట్స్ ఓపెన్..

Allu Arjun : అల్లు అర్జున్ AAA థియేటర్ ఓపెన్.. మొదటి సినిమాగా ఆదిపురుష్.. టికెట్ బుకింగ్స్ ఓపెన్..

Allu Arjun AAA Cinemas open and bookings open for prabhas adipurush

Updated On : June 15, 2023 / 12:00 PM IST

Allu Arjun AAA Cinemas : హైదరాబాద్ లో మహేష్ బాబు (Mahesh Babu) తరువాత ఆసియన్ సినిమాస్ (Asian Cinemas) తో కలిసి అల్లు అర్జున్ మరో మల్టీప్లెక్స్ ని అందుబాటులోకి తీసుకు వస్తున్నాడు. ఇప్పటికే హైదరాబాద్ AMB సినిమాస్ సిటీలోనే బెస్ట్ మల్టీప్లెక్స్ గా రన్ అవుతూ వస్తుంది. తాజాగా ఇప్పుడు ఆసియన్ సంస్థ అల్లు అర్జున్ తో కలిసి హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని సత్యం థియేటర్ స్థానంలో ‘ఆసియన్ అల్లు సత్యం థియేటర్’ని అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. ఈ థియేటర్ లాంచ్ ఈవెంట్ నేడు (జూన్ 15) ఘనంగా జరిగింది.

Adipurush : ఆదిపురుష్‌కి ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..? సీత పాత్ర కోసం మొదటి అనుకున్న హీరోయిన్ ఎవరు..?

ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav), అల్లు అరవింద్ (Allu Aravind) ముఖ్య అతిథులుగా వచ్చారు. బన్నీ చేతులు మీదగా ఈ థియేటర్ ఓపెనింగ్ జరిగింది. రేపటి నుంచి ఈ థియేటర్ లో సినిమాలు ప్రదర్శించబోతున్నారు. మొదటి సినిమాగా ప్రభాస్ (Prabhas) ఆదిపురుష్ (Adipursh) రిలీజ్ కాబోతుంది. ఈరోజు నుంచి ఈ సినిమాకి సంబంధించిన టికెట్ బుకింగ్స్ జరగనున్నాయి. ఈ థియేటర్ లో మొత్తం 5 స్క్రీన్స్ అందుబాటులో ఉండబోతున్నాయి.

Allu Arjun : మరోసారి త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబో.. ఈ సారి ఆహా కోసం.. ఏం ప్లాన్ చేశారో?

మొదటి స్క్రీన్.. బార్కో లేజర్ ప్రొజెక్షన్ అండ్ ATMOS సౌండ్ కలిగి ఉంటే, సెకండ్ స్క్రీన్.. ఎపిక్ లుజోన్ స్క్రీన్ అండ్ ATMOS సౌండ్ కలిగి ఉంటుంది. ఇక మిగిలిన మూడు స్క్రీన్స్.. 4K ప్రొజెక్షన్ తో ఉండబోతున్నాయి. అలాగే మొత్తం స్క్రీన్స్ Dolby 7.1 సౌండ్ తో రాబోతున్నాయి. అలాగే ఆసియన్ సత్యం మాల్ లో పాపులర్ ఫుడ్ బ్రాండ్స్ తో బిగ్ ఫుడ్ కోర్ట్ ని కూడా అందుబాటులోకి తీసుకు రాబోతున్నారు. ఇక అల్లు అర్జున్ ని చూసేందుకు అభిమానులు థియేటర్ వద్దకి భారీగా తరలివచ్చారు. వారికి అభివాదం చేస్తున్న అల్లు అర్జున్ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.