Pushpa The Rise : డిసెంబర్‌లో ఛలో దుబాయ్.. తగ్గేదే లే..

అల్లు అర్జున్ - సుకుమార్ ‘పుష్ప’ కోసం దుబాయ్ ఎందుకు వెళ్తున్నారంటే..

Pushpa The Rise : డిసెంబర్‌లో ఛలో దుబాయ్.. తగ్గేదే లే..

Bunny Sukku

Updated On : November 11, 2021 / 11:30 AM IST

Pushpa The Rise: పాన్ ఇండియా స్థాయి సినిమా అంటే.. ఆ రేంజ్‌లో ఆడియన్స్‌కు కనెక్ట్ అవ్వాలంటే ప్రమోషన్స్ పిచ్చ పీక్స్‌లో ఉండాలి మరి. అందుకు తగ్గట్లే మేకర్స్ భారీ ప్లాన్స్ వేస్తున్నారు. తెలుగు, మలయాళం, హిందీ (యూట్యూబ్ డబ్బింగ్ మూవీస్) తో తన మార్కెట్ పెంచుకున్న బన్నీ ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో తన సినిమాను విడుదల చెయ్యబోతున్నాడు.

NBK 107 : బాబు రెడీ బాబు.. యాక్షన్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న హ్యట్రిక్ సినిమా ‘పుష్ప’.. ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీని మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా కలిసి నిర్మిస్తున్నాయి. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన పుష్ప రాజ్ ఇంట్రో వీడియో, క్యారెక్టర్ల తాలుకు పోస్టర్లు, మూడు పాటలు సెన్సేషన్ క్రియేట్ చేసాయి.

Anasuya Bharadwaj : ‘బంగారం’ సిస్టర్ అంటూ ట్రోల్స్..

ప్రస్తుతం షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కి వచ్చేసింది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా స్పీడ్‌గా జరుగుతోంది. డిసెంబర్ 17న ‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ Pushpa The Rise రిలీజ్ కానుంది. ఇక ప్రమోషన్స్ కూడా భారీగా చేసే ప్లాన్‌లో ఉంది టీం. డిసెంబర్ 3న దుబాయ్‌లో గ్రాండ్ ప్రమోషనల్ ఈవెంట్ ప్లాన్ చేశారు. అల్లు అర్జున్ – సుకుమార్‌తో పాటు యూనిట్ అంతా ఈ ఈవెంట్‌లో పాల్గొంటారు.

Naatu Naatu Song : గట్టు మీద గడ్డపారలు! ఫ్యూజ్‌లు ఎగిరిపోయేలా ఎన్టీఆర్ – చరణ్ డ్యాన్స్ !