స్టైలిష్ కపుల్.. నిహారిక నిశ్చితార్థంలో మెరిసిన బన్నీ, స్నేహా రెడ్డి..

  • Published By: sekhar ,Published On : August 14, 2020 / 06:29 PM IST
స్టైలిష్ కపుల్.. నిహారిక నిశ్చితార్థంలో మెరిసిన బన్నీ, స్నేహా రెడ్డి..

Updated On : August 14, 2020 / 6:47 PM IST

మెగా డాటర్ నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ వెంకట చైతన్యల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ అంతా తరలివచ్చింది. ఆగస్టు 13వ తేదీ రాత్రి 8 గంటలకు హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్‌లో ఎంగేజ్‌మెంట్ జరిగింది. కరోనా కారణంగా కేవలం…కొద్ది మంది ఫ్యామిలీ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.

చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్, సుస్మిత, కళ్యాణ్ దేవ్, శ్రీజ, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ తదితరులు హాజరయ్యారు. అయితే అల్లు అర్జున్, స్నేహా రెడ్డి దంపతులు స్టైలిష్ లుక్‌లో తళుక్కున మెరవడంతో పాటు ఫంక్షన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Niharika Konidela Engagement

బన్నీ స్టైలిస్ట్‌ హర్మాన్ కౌర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఫోటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్‌, స్నేహ ఇద్దరు మనీష్ మల్హోత్రా డిజైన్‌ చేసి దుస్తులు ధరించి వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. బ్లాక్ క‌ల‌ర్ డ్రెస్‌లో డిఫ‌రెంట్ హెయిర్ స్టైల్‌తో బ‌న్నీని చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ‘ఈ జంట ఫ్యాషన్‌లో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచారు’.. ‘అల్లు అర్జున్‌కు భార్య స్నేహా రెడ్డి మీద ఉన్న ప్రేమను చూసి.. జనాలు వారితో ప్రేమలో పడుతున్నారు’.. ‘మేడ్‌ ఫర్‌ ఇచ్‌ అదర్‌’ అంటూ నెటిజన్స్ కామెంట్‌ చేస్తున్నారు.

https://www.instagram.com/p/CD2y6_jAtSW/?utm_source=ig_web_copy_link