Allu Arjun : సమ్మర్ లో నిజమైన దసరా.. దసరా సినిమాపై ఐకాన్ స్టార్ ప్రశంసలు..
దసరా సినిమాపై అభిమానులు, ప్రేక్షకులే కాక పలువురు ప్రముఖులు కూడా అభినందిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, ప్రభాస్.. లాంటి స్టార్ హీరోలతో పాటు అనేకమంది నటీనటులు దసరా సినిమాని, చిత్రయూనిట్ ని అభినందిస్తున్నారు. తాజాగా దసరా సినిమాపై అల్లు అర్జున్ అభినందనలు కురిపించారు.

Allu Arjun Appreciations on Dasara Movie and Nani
Allu Arjun : నాని(Nani), కీర్తి సురేష్(Keerthy Suresh) జంటగా కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో ఇటీవల శ్రీరామనవమికి వచ్చిన దసరా(Dasara) సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. నాని ఫుల్ మాస్ రోల్ లో కనిపించడం, సినిమా సాంగ్స్ బాగుండటం, ముందు నుంచి సినిమా పై హైప్ ఉండటం, అదిరిపోయిన సినిమా క్లైమాక్స్.. ఇవన్నీ సినిమాకి ప్లస్ అయి బ్లాక్ బస్టర్(Block Buster) గా నిలిపాయి. దసరా సినిమా ఇప్పటికే 110 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
ఇక దసరా సినిమాపై అభిమానులు, ప్రేక్షకులే కాక పలువురు ప్రముఖులు కూడా అభినందిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, ప్రభాస్.. లాంటి స్టార్ హీరోలతో పాటు అనేకమంది నటీనటులు దసరా సినిమాని, చిత్రయూనిట్ ని అభినందిస్తున్నారు. తాజాగా దసరా సినిమాపై అల్లు అర్జున్ అభినందనలు కురిపించారు. దసరా సినిమాని, చిత్ర యూనిట్ ని అభినందిస్తూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.
Vedaant : మరోసారి వార్తల్లో మాధవన్ తనయుడు.. మలేషియన్ ఛాంపియన్షిప్ లో ఏకంగా 5 గోల్డ్ మెడల్స్
అల్లు అర్జున్ తన ట్వీట్ లో.. దసరా టీం అందరికి బిగ్ కంగ్రాట్స్. ఇది బ్రిలియంట్ సినిమా. నా బ్రదర్ నాని అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కీర్తిసురేష్, మిగిలిన టీం అంతా కూడా బాగా నటించారు. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ గారు సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఇచ్చారు. సత్యన్ గారు అద్భుతమైన కెమెరా వర్క్ ఇచ్చారు. కెప్టెన్ అఫ్ ది షిప్ డైరెక్టర్ ఓదెల శ్రీకాంత్ డెబ్యూట్ డైరెక్టర్ లా అనిపించకుండా చేశాడు. ఇతని తెలివితేటలు అమోఘం. ప్రొడ్యూసర్, చిత్రయూనిట్ కి హృదయపూర్వక అభినందనలు. సమ్మర్ లోనిజమైన దసరా ఈ సినిమా అని ట్వీట్ చేశారు. దీంతో బన్నీ చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
Big Congratulations to the entire team of #Dasara . Brilliantly made film . Finest performance my brother @NameisNani . Candid performances by @KeerthyOfficial and all the other cast . Wonderful songs & B.Score by @Music_Santhosh garu & excellent camera work by Sathyan garu . The…
— Allu Arjun (@alluarjun) April 17, 2023