Shreyas Talpade : బాలీవుడ్ లో ‘పుష్ప’ కోసం బన్నీకి వాయిస్ ఇచ్చిన శ్రేయాస్.. ఇప్పుడు తెలుగులో హీరోగా..

బాలీవుడ్(Bollywood) పాపులర్ యాక్టర్ అయిన శ్రేయాస్ తల్పడే కామెడీ, సీరియస్ రోల్స్‌లో తన నటనతో అందరినీ మెప్పించారు. అజాగ్రత్త(Ajagratha) సినిమాతో శ్రేయాస్ తల్పడే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు.

Shreyas Talpade : బాలీవుడ్ లో ‘పుష్ప’ కోసం బన్నీకి వాయిస్ ఇచ్చిన శ్రేయాస్.. ఇప్పుడు తెలుగులో హీరోగా..

allu arjun bollywood dubbing Shreyas Tapade entry in tollywood as hero

Updated On : May 14, 2023 / 7:59 AM IST

Ajagratha : పుష్ప(Pushpa) సినిమాతో అల్లు అర్జున్‌(Allu Arjun)కు నార్త్‌లో ఎంత పేరు వచ్చిందో.. ఆ పాత్రకు డబ్బింగ్ చెప్పిన శ్రేయాస్ తల్పడే(Shreyas Talpade)కు కూడా అంతే గుర్తింపు వచ్చింది. బాలీవుడ్(Bollywood) పాపులర్ యాక్టర్ అయిన శ్రేయాస్ తల్పడే కామెడీ, సీరియస్ రోల్స్‌లో తన నటనతో అందరినీ మెప్పించారు. అజాగ్రత్త(Ajagratha) సినిమాతో శ్రేయాస్ తల్పడే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ టైటిల్‌ చూస్తుంటే ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది.

రాధిక కుమారస్వామి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి ఎం శశిధర్ దర్శకత్వం వహిస్తున్నారు. రవి రాజ్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం క్లాప్ కొట్టగా, నిర్మాత ఠాగూర్ మధు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌ జానర్‌లో వస్తోన్న ఈ అజాగ్రత్త సినిమాలో ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలను పోషించనున్నారు. రావు రమేష్‌, సునీల్, ఆదిత్య మీనన్ వంటి వారు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు సందీప్ వల్లూరి సినిమాటోగ్రఫర్‌గా, శ్రీహరి సంగీత దర్శకుడిగా, రవి వర్మ ఫైట్ మాస్టర్‌గా వ్యవహరించనున్నారు.

శ్రేయాస్ తల్పడే హీరోగా తెలుగులో ఎంట్రీ ఇస్తున్న అజాగ్రత్త సినిమా ఓపెనింగ్ పూజాకార్యక్రమం రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. పూజా కార్యక్రమాల అనంతరం నిర్మాత రవి రాజ్, దర్శకుడు శశిధర్ మాట్లాడుతూ.. ఈ సినిమాను ఏడు భాషల్లో తెరకెక్కిస్తున్నాం. ఇలాంటి మంచి ప్రొడక్షన్ కంపెనీలో చాన్స్ దొరకడం, రాధిక మేడం అవకాశం ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. మీ ప్రేమ, ఆదరాభిమానాలు మా టీం మీద చూపించండి అని కోరారు.

హీరో శ్రేయాస్ తల్పడే మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. అజాగ్రత్త టీంకు కృతజ్ఞతలు చెబుతున్నాను. ఈ రెండు పదాలే నేర్చుకున్నాను. త్వరలో తెలుగు నేర్చుకుంటాను. ఈ టీంతో పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది. కరోనా టైంలో ఇండస్ట్రీ ఎంతో మారిపోయింది అని అన్నారు. విలన్ శ్రవణ్ మాట్లాడుతూ.. శ్రేయాస్ తల్పడే గారితో పని చేస్తుండటం ఆనందంగా ఉంది. శశి గారు నాకు ఎప్పటి నుంచో పరిచయం. టైటిల్ విన్నప్పుడే కథ నచ్చింది. నాకు అవకాశం ఇచ్చిన రవి గారికి థాంక్స్ అని అన్నారు.

allu arjun bollywood dubbing Shreyas Tapade entry in tollywood as hero

 

Harish Shankar : అలాంటి వాళ్లనే బ్లాక్ చేస్తాను.. దానికి నేని రెడీనే.. హరీష్ శంకర్ ట్వీట్..

JDS పార్టీ అధినేత కుమారస్వామి భార్య, నటి రాధిక కుమారస్వామి మాట్లాడుతూ.. ఈ సినిమాకు నేను నిర్మాతగా ఉండాల్సింది. కానీ నేను హీరోయిన్‌గా ఫిక్స్ అవుతాను అని అనుకోలేదు. ఎవరూ సెట్ అవ్వడం లేదని దర్శకుడు కంగారు పడుతూ ఉన్నారు. నా డేట్స్ కావాలా? అని అడిగాను. కథ చెప్పమని అడిగాను. స్క్రిప్ట్ విన్నాక షాక్ అయ్యాను. చాలా ఏళ్ల తరువాత ఇలా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. నాకు అవకాశం ఇచ్చిన అన్నయ్య నిర్మాతకు, డైరెక్టర్ శశికి థాంక్స్. శ్రేయాస్ ఇది వరకు నటించిన సినిమాలు చూశాను. ఆయన ఎంతో బాగా నవ్విస్తారు. ఈ సినిమాతో పని చేయడం ఆనందంగా ఉంది అని తెలిపారు.