Mangalavaaram : పాయల్ రాజ్‌పుత్ కోసం అల్లు అర్జున్.. ‘మంగళవారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి పుష్ప..
పాయల్ రాజ్‌పుత్ ‘మంగళవారం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి అల్లు అర్జున్..

Allu Arjun chief guest for Payal Rajput Mangalavaaram movie pre release event
Mangalavaaram : ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన దర్శకుడు అజయ్ భూపతి.. రెండో సినిమా ‘మహాసముద్రం’తో భారీ ప్లాప్ ని అందుకున్నాడు. శర్వానంద్, సిద్దార్ద్ లతో తెరకెక్కిన ఈ మల్టీస్టారర్ బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ మిగిలించింది. ఇప్పుడు మూడో సినిమాగా ‘మంగళవారం’ అనే ఒక డిఫరెంట్ కథతో వస్తున్నాడు. తన మొదటి సినిమాలో హీరోయిన్ గా నటించిన పాయల్ రాజ్‌పుత్ ని ముఖ్య పాత్రలో పెట్టి అజయ్ భూపతి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ అండ్ ట్రైలర్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. ఇక వచ్చే వారం రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. ఈక్రమంలోనే ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ ని తీసుకు వస్తున్నారు. నవంబర్ 11న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. అల్లు అర్జున్ రాకతో ఈ సినిమా రిలీజ్ పై మరింత బజ్ క్రియేట్ అవుతుంది. నవంబర్ 17న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.
Also read : Jabardasth : ప్రేమ వివాహం చేసుకోబోతున్న జబర్దస్త్ నటి..
View this post on Instagram
స్వాతి గునుపాటి, ఎం సురేష్ వర్మ, అజయ్ భూపతి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ క్యారెక్టర్ చాలా వైరల్ గా ఉంటుందట. ఒకవేళ సినిమా ఏ మాత్రం క్లిక్ అయినా యూత్ క్యూ కట్టేస్తారు అని ఇండస్ట్రీ వ్యక్తులు చెబుతున్నారు. రిలీజ్ చేసిన ట్రైలర్ అండ్ టీజర్స్ లోనే పాయల్ క్యారెక్టర్ యూత్ ని థ్రిల్ చేసేలా కనిపించింది. ఇక ‘మహాసముద్రం’ సినిమాలా ఇది మిస్ ఫైర్ అవ్వదని, ఇది అందర్నీ థ్రిల్ చేసే కథని, కచ్చితంగా హిట్టు అవుతుందని దర్శకుడు చెబుతున్నాడు. మరి థియేటర్ వద్ద ఈ చిత్రం ఎలాంటి రిజల్ట్ అని అందుకుంటుందో చూడాలి.