Jabardasth : ప్రేమ వివాహం చేసుకోబోతున్న జబర్దస్త్ నటి..
టాలీవుడ్ లో సినిమా స్టార్స్ తో పాటు టీవీ స్టార్స్ కూడా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. తాజాగా జబర్దస్త్ నటి..

Jabardasth actress pavithraa getting married his boy friend santhosh
Jabardasth : టాలీవుడ్ లో పెళ్లి సందడి కనిపిస్తుంది. సినిమా స్టార్స్ తో పాటు టీవీ స్టార్స్ కూడా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇక తెలుగు సూపర్ హిట్ కామెడీ షో జబర్దస్త్ కి సంబంధించిన నటులు.. ఇటీవల వరుసగా పెళ్లి బంధం మొదలు పెడుతూ వస్తున్నారు. తాజాగా జబర్దస్త్ నటి పవిత్ర.. తన పెళ్లి వార్త గురించి చెప్పింది. తన చేసుకోబోయే వాడిని పరిచయం చేస్తూ తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వేసింది.
జబర్దస్త్ షో ద్వారా ఫేమ్ ని సంపాదించుకున్న పవిత్ర.. పలు టీవీ షోల్లో కూడా అలరిస్తూ వస్తుంది. అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఆడియన్స్ ని నిత్యం పలకరిస్తూ వస్తుంటుంది. ఇక గత కొంతకాలంగా సంతోష్ తో ప్రేమలో ఉన్న పవిత్ర.. ఇప్పుడు పెళ్ళికి ఒకే చెప్పినట్లు కన్ఫార్మ్ చేసింది. సంతోష్ తో కూడా యూట్యూబ్ వీడియోలు చేసే పవిత్ర.. ఐదు నెలలు క్రిందట ఒక ప్రాంక్ పెళ్లి వీడియో కూడా చేసింది.
Also read : Samantha : విడాకులు, అనారోగ్యం పై సమంత వైరల్ కామెంట్స్.. వాళ్ళ వల్లే కోలుకున్నా..
ఆ వీడియో అప్పుడు బాగా వైరల్ అయ్యింది. ఇక ఇప్పుడు ఆ అబ్బాయితో రియల్ పెళ్ళికి ఒకే చేసినట్లు చెప్పింది. సంతోష్ కి ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. పవిత్ర తన పెళ్లి వార్తని అందరికి తెలియజేసింది. ఈ క్షణం కోసం సంతోషం ఒక సంవత్సరం నుంచి ఎంతో ఓపికగా ఎదురు చూస్తున్నాడని పవిత్ర చెప్పుకొచ్చింది. ఇక ఈ పోస్టు చూసిన నెటిజెన్స్ ఆమె కంగ్రాట్స్ తెలియజేస్తున్నారు. మరి ఈ ఇద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది.
View this post on Instagram