Samantha : విడాకులు, అనారోగ్యం పై సమంత వైరల్ కామెంట్స్.. వాళ్ళ వల్లే కోలుకున్నా..
సమంత ఒక మ్యాగజైన్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో విడాకులు, అనారోగ్యం పై..

Samantha comments about her divorce and health problems
Samantha : సమంత ప్రెజెంట్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి మయోసైటిస్ చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఒక పక్క ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతూనే మరో పక్క ఆయుర్వేదంతో పాటు రకరకాల కొత్త వైద్యాలను కూడా చేయించుకుంటూ వస్తున్నారు. ఇటీవల భారత్ వచ్చిన సమంత మళ్ళీ ఇప్పుడు విదేశాలకు వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. అయితే ఇటీవల సమంత ఒక మ్యాగజైన్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన ఒక విషయాన్ని సమంత తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన జీవితంలోని మంచి చెడుల గురించి సమంత ఎందుకు పదేపదే పబ్లిక్ గా మాట్లాడుతారు..? తన అభిమానులను కూడా తమ జీవితాలు గురించి ఓపెన్ గా ఉండమని సమంత చెబుతున్నారా..? అనే ప్రశ్నలు సమంతని అడిగినప్పుడు, ఆమె ఇచ్చిన సమాధానం..
“సినిమాలు ప్లాప్ అవ్వడం, పెళ్లి విడాకులు అవ్వడం, హెల్త్ ప్రాబ్లెమ్, అలాగే విమర్శలు ఇలా ఎన్నో నన్ను కృంగిపోయేలా చేశాయి. అయితే వాటి నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచించా. నాలా గతంలో బాధని అనుభవించిన వారు ఎలా ఈ సమస్యల నుంచి కోలుకున్నారో అని తెలుసుకున్నా. వారి గురించి చదివాను. వాళ్ళ వల్లే నా సమస్యలు నుంచి నేను కోలుకున్నాను.
Also read : Anchor Suma : యాంకర్ సుమ తాతయ్య గిన్నిస్ బుక్ అఫ్ రికార్డు.. ఎందుకో తెలుసా..?
స్టార్ స్టేటస్ రావడం అనేది ఒక అద్భుతమైన బహుమతి. ఆ హోదాని ఒక భాద్యతలా భావించి మీ కథలు అందరికి చెప్పండి. అవి ఇంతవారికి సహాయ పడతాయి. ఆ సమస్య ఎదుర్కొనే వారికీ మీ స్టోరీ కూడా ఒక సమాధానం అవుతుంది. బయట చాలామంది మనం ఎదుర్కొంటున్న సమస్యలే, మనం ఉన్న పరిస్థితుల్లోనే ఉండి ఉంటారు. వారికీ మన లైఫ్ ఒక పరిష్కారం అవుతుంది. అందుకోసం నేను మంచి చెడుల గురించి పబ్లిక్ గా మాట్లాడుతూనే ఉంటాను” అంటూ చెప్పుకొచ్చారు.
View this post on Instagram