కేరళలో బన్నీ క్రేజ్ మామూలుగా లేదుగా! మోహన్ లాల్ సినిమాను వెనక్కి నెట్టి మరీ..
మలయాళంలో మోహన్ లాల్ సినిమాను సైతం వెనక్కి నెట్టి విజయ విహారం చేస్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘అంగు వైకుంఠపురత్తు’..

మలయాళంలో మోహన్ లాల్ సినిమాను సైతం వెనక్కి నెట్టి విజయ విహారం చేస్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘అంగు వైకుంఠపురత్తు’..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో.. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘అల… వైకుంఠపురములో’.. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయ విహారం చేస్తోంది. కేవలం అయిదు రోజుల్లోనే రికార్డ్ స్థాయి వసూళ్లు రాబట్టడమే కాక పలు ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డులు నెలకొల్పడం విశేషం.
ఈ చిత్రం కేరళలోనూ రికార్డులు క్రియేట్ చేస్తోంది. బన్నీకి కేరళలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ తనను మల్లు అర్జున్ అని పిలుస్తారనే సంగతి తెలిసిందే. అల వైకుంఠపురములో సినిమాను మలయాళంలో ‘అంగు వైకుంఠపురత్తు’ పేరుతో రిలీజ్ చేయగా సూపర్ హిట్ అయ్యింది.
అల్లు అర్జున్ సినిమాకి పోటీగా కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ నటించిన `బిగ్ బ్రదర్` రిలీజ్ అయ్యింది. అయినా కూడా బన్నీ సినిమాకు అధిక స్థాయిలో టికెట్స్ తెగుతుండడం విశేషం. పైగా మోహన్ లాల్ సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతో అక్కడి ప్రేక్షకులు బన్నీ మూవీ వైపే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని కేరళ డిస్ట్రిబ్యూటర్ తెలిపారు. త్వరలో కర్ణాటక, కేరళలో సక్సెస్ సెలబ్రేషన్స్ చేయనుంది మూవీ టీమ్..