Allu Arjun : బన్నీ గురించి తప్పుడు థంబ్ నెయిల్స్.. యూట్యూబ్ ఛానల్ ఆఫీస్ కు వెళ్లి వార్నింగ్ ఇచ్చిన ఫ్యాన్స్..

ఇటీవల అల్లు అర్జున్ పై ఓ యూట్యూబ్ ఛానల్ నెగిటివ్ గా లేనిపోని థంబ్ నెయిల్స్ పెడుతూ పలు వీడియోలు పోస్ట్ చేసింది.

Allu Arjun : బన్నీ గురించి తప్పుడు థంబ్ నెయిల్స్.. యూట్యూబ్ ఛానల్ ఆఫీస్ కు వెళ్లి వార్నింగ్ ఇచ్చిన ఫ్యాన్స్..

Allu Arjun Fans Warning to a YouTube Channel who post Negative Thumbnails on Allu Arjun

Updated On : November 11, 2024 / 4:34 PM IST

Allu Arjun : ఇటీవల యూట్యూబ్ ఛానల్స్ తమ వీడియోలకు ఇష్టమొచ్చిన థంబ్ నెయిల్స్ పెడుతున్న సంగతి తెలిసిందే. లోపల ఒక కంటెంట్ ఉంటే బయట దానికి సంబంధం లేని ఇంకో థంబ్ నెయిల్స్ పెట్టి వాళ్ళ వీడియోలకు వ్యూస్ రప్పించుకుంటున్నారు. అయితే దీనిపై ఇప్పటికే పలువురు విమర్శలు చేస్తున్నారు. పలువురు సెలబ్రిటీలు కూడా గతంలో యూట్యూబ్ థంబ్ నెయిల్స్ పై విమర్శలు చేసారు.

Also Read : Pushpa 2 Trailer : పుష్ప 2 ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది.. కొత్త పోస్టర్ తో.. ట్రైలర్ ఎప్పుడంటే..

అయితే ఇటీవల అల్లు అర్జున్ పై ఓ యూట్యూబ్ ఛానల్ నెగిటివ్ గా లేనిపోని థంబ్ నెయిల్స్ పెడుతూ పలు వీడియోలు పోస్ట్ చేసింది. దీనిపై బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ క్రమంలో కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆ యూట్యూబ్ ఛానల్ ఆఫీస్ కి వెళ్లి గొడవ చేసారు. ఆ ఆఫీస్ వాళ్లకు వార్నింగ్ ఇచ్చారు. ఈ థంబ్ నెయిల్స్ పెట్టిన ఓ వ్యక్తితో అల్లు అర్జున్ కి, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పించారు.

ఇంకోసారి ఇలాంటివి రిపీట్ అయితే మాత్రం మాటలతో చెప్పము, ఆఫీస్ పై దాడి చేస్తాం అంటూ బన్నీ ఫ్యాన్స్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.