Allu Arjun: 40 ఏళ్ల వయసులో నేషనల్ స్టార్ డమ్.. నిలబెట్టుకుంటాడా?

ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా.. ఐకాన్ స్టార్ ఇమేజ్ ను అమాంతం పెంచేసింది. నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎప్పుడా అని పాన్ ఇండియా ఆడియెన్స్ ఎదురు చూసేలా చేసింది. అవును అసలే మాత్రం అంచనాలు..

Allu Arjun: 40 ఏళ్ల వయసులో నేషనల్ స్టార్ డమ్.. నిలబెట్టుకుంటాడా?

Allu Arjun

Updated On : April 8, 2022 / 4:00 PM IST

Allu Arjun: ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా.. ఐకాన్ స్టార్ ఇమేజ్ ను అమాంతం పెంచేసింది. నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎప్పుడా అని పాన్ ఇండియా ఆడియెన్స్ ఎదురు చూసేలా చేసింది. అవును అసలే మాత్రం అంచనాలు లేకుండా వెళ్లి బాలీవుడ్ లోనూ పుష్ప సత్తాచాటింది. ఇంకేముంది బన్నీ ఆర్మీలో నార్త్ మెంబర్స్ పెరిగారు. బన్నీకి రెస్పాన్స్ బిలిటీ మరింత పెరిగింది. బన్నీ బర్త్ డే వేళ ఫ్యాన్స్ సంబరాల్లో ఉంటే.. వచ్చిన క్రేజ్ ని నిలబెట్టుకునేలా.. సూపర్ స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకునేలా కష్టపడాలనుకుంటున్నారు అల్లు అర్జున్.

Allu Arjun : పార్టీ చేసుకో అంటూ.. అల్లుడిపై చిరంజీవి స్పెషల్ ట్వీట్

తగ్గేదే అంటూ పాన్ ఇండియా ప్రణాళికలు రచిస్తున్నారు అల్లు అర్జున్. నార్త్ లో కూడా పుష్పకు ట్రెమండస్ రెస్పాన్స్ దక్కడమనేది పెద్ద సర్ ప్రైజ్. బన్నీ కూడా ఈ రెంజ్ ఎక్స్ పెక్ట్ చేయలేదు. అలా జస్ట్ సింఫుల్ గా బాలీవుడ్ ఆడియెన్స్ ముందుకు పుష్పను వదిలిస్తే.. ఇప్పుడక్కడ బన్నీకి ఫ్యాన్ గ్రూప్స్ ఫామ్ అవుతున్నాయి. స్టార్స్, స్టార్ మేకర్స్ పొగిడేస్తున్నారు. పుష్ప2 కోసం సౌత్ ఎలా ఎదురుచూస్తుందో అంతకుమించే బాలీవుడ్ ఆరా తీస్తుంది. అందుకే అక్కడ మరింత స్పీడ్ పెంచేందుకు.. జోష్ చూపించేందుకు ముచ్చటపడుతున్నారు ఐకాన్ స్టార్.

Allu Arjun: పుష్ప 2 కోసం బన్నీ డేరింగ్ స్టెప్.. ఏమిటంటే..?

ఫ్యాన్స్.. ఆర్మీ.. బన్నీకిప్పుడు నార్త్ లోనూ ఫాలోయింగ్ బాగా పెరిగింది. అందుకే షాకింగ్ సక్సెస్ ఎలిమెంట్ గా పుష్ప నిలిచినా.. అందరూ దృష్టి పెట్టిన పుష్ప2తో మెమొరబుల్ హిట్ ఇవ్వాలనుకుంటున్నారు. దానికి తగిన విధంగా వర్కవుట్ చేస్తున్నారు. అందరికీ సింక్ అయ్యేలా స్టోరీలో మార్పులు చేయడం దగ్గరి నుంచి.. లుక్, డాన్స్, క్యారెక్టరైజేషన్ ఇలా పుష్ప2కి సంబంధించిన ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పుష్ప 2 తర్వాత ఈ హీరో చేయబోయే సినిమాలూ పాన్ ఇండియా రేంజ్ నే చూపించబోతున్నాయి. అందుకే తన 40 ఏళ్ల బర్త్ డే సంబరాల్లో ఫ్యాన్స్ మునిగితేలుతుంటే.. 40 ఏళ్ల వయసులో వచ్చిన నేషనల్ స్టార్ డం నిలబెట్టుకునేలా బన్నీ ఆలోచిస్తున్నారు. మరి ఇండియా సూపర్ స్టార్ రేస్ లో అల్లు అర్జున్ దూసుకుపోతారా..?