Allu Arjun : నంద్యాల ఇష్యూలో అల్లు అర్జున్ కు ఊరట.. హైకోర్టు ఏమందంటే..

ఇటీవల అల్లు అర్జున్ దీనిపై ఏపీ హైకోర్టుని ఆశ్రయించి కేసుని కొట్టివేయాల్సిందిగా కోరారు.

Allu Arjun : నంద్యాల ఇష్యూలో అల్లు అర్జున్ కు ఊరట.. హైకోర్టు ఏమందంటే..

Allu Arjun get Relief from High Court in Nandyala Issue Case

Updated On : November 6, 2024 / 12:56 PM IST

Allu Arjun : గతంలో ఏపీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి తన ఫ్రెండ్, వైసీపీ నేత శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి సపోర్ట్ గా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అయితే 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉండగా అనుమతి లేకుండానే భారీగా జన సమీకరణ చేసారని, ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని పోలీసులు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసారు. ఇటీవల అల్లు అర్జున్ దీనిపై ఏపీ హైకోర్టుని ఆశ్రయించి కేసుని కొట్టివేయాల్సిందిగా కోరారు.

Also Read : Allu Sneha Reddy : తిరుమలలో అల్లు అర్జున్ భార్య స్నేహరెడ్డి.. ఫోటోల కోసం ఎగబడ్డ జనాలు.. వీడియో వైరల్..

గతంలో FIR ఆధారంగా తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇవ్వగా తాజాగా నేడు ఈ కేసుకు సంబంధించిన ఫలితం వెలువడింది. అల్లు అర్జున్ పై ఉన్న ఈ కేసుని హైకోర్టు కొట్టేసింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన కేసులో పోలీసులు అల్లు అర్జున్ పై నమోదు చేసిన కేసుని హైకోర్టు కొట్టేసింది. దీంతో బన్నీకి ఊరట లభించింది.