Allu Arjun : బాలీవుడ్ స్టార్ హీరోలతో బన్నీ.. హృతిక్‌కి హగ్ ఇస్తూ బాలీవుడ్ పెళ్ళిలో అల్లు అర్జున్ సందడి..

తాజాగా బన్నీ బాలీవుడ్ నిర్మాత మధు మంతెన రెండో వివాహానికి హాజరయ్యారు. వివాహానికి పలువురు బాలీవుడ్ స్టార్స్, ప్రముఖులు విచ్చేసారు.

Allu Arjun : బాలీవుడ్ స్టార్ హీరోలతో బన్నీ.. హృతిక్‌కి హగ్ ఇస్తూ బాలీవుడ్ పెళ్ళిలో అల్లు అర్జున్ సందడి..

Allu Arjun gives hug to Hrithik Roshan in a bollywood producer marriage photo goes viral

Updated On : June 12, 2023 / 8:34 AM IST

Bollywood : పుష్ప(Pushpa) సినిమాతో బాలీవుడ్ లో కూడా అల్లు అర్జున్(Allu Arjun) క్రేజ్ సంపాదించిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ తో సినిమాలు చేయాలని ఇప్పటికే బాలీవుడ్ వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఇక పుష్ప 2 కోసం బాలీవుడ్ వాళ్ళు కూడా తెగ ఎదురుచూస్తున్నారు. ఆల్రెడీ అల్లుఅర్జున్ – సందీప్ వంగ(Sandeep Vanga)కాంబినేషన్ లో ఓ బాలీవుడ్ ప్రాజెక్టు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక బన్నీ కూడా ఇటీవల బాలీవుడ్ లో పలు కార్యక్రమాలకు హాజరవుతున్నారు. తాజాగా బన్నీ బాలీవుడ్ నిర్మాత మధు మంతెన రెండో వివాహానికి హాజరయ్యారు. ఆర్జీవీ బామ్మర్ది, నిర్మాత మధు మంతెన ఆదివారం రాత్రి ప్రముఖ యోగ ట్రైనర్ ఐరా త్రివేదిని వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి పలువురు బాలీవుడ్ స్టార్స్, ప్రముఖులు విచ్చేసారు. అల్లు అర్జున్ కూడా ఈ వివాహానికి హాజరయ్యాడు.

Pawan Kalyan : తేజ్‌కి యాక్సిడెంట్ అయినప్పుడు.. పవన్ కళ్యాణ్ రాత్రంతా హాస్పిటల్‌లోనే ఉండి.. తేజ్ – పవన్ మధ్య బాండింగ్

అయితే ఈ వివాహ వేడుకలో అల్లు అర్జున్.. అమీర్ ఖాన్, హృతిక్ రోషన్ తో సరదాగా కాసేపు ముచ్చరించారు. హృతిక్ రోషన్ బన్నీని ఆప్యాయంగా హత్తుకున్నాడు. దీంతో బన్నీ హృతిక్ కి హగ్ ఇచ్చే ఫోటో వైరల్ గా మారింది. ఈ ఫొటోలో పక్కనే అమీర్ ఖాన్ కూడా ఉన్నాడు. దీంతో బన్నీ అభిమానులు ఈ ఫోటోని మరింత వైరల్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Manav Manglani (@manav.manglani)