Allu Arjun : పఠాన్ రికార్డులను బ్రేక్ చేసిన ‘పుష్ప2’.. స్పందించిన యశ్ రాజ్ ఫిల్మ్స్.. అల్లు అర్జున్ రియాక్షన్ వైరల్
తమ సినిమా రికార్డులను బ్రేక్ చేయడం పట్ల యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పందించింది.

Allu Arjun is touched by Yash Raj Films gesture
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుంది. డిసెంబర్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బన్నీ నట విశ్వరూపానికి అందరూ ఫిదా అయ్యారు. ఇప్పటికే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1500 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి దూసుకుపోతుంది. ఇక హిందీలో ఈ చిత్ర సక్సెస్ గురించి చెప్పాల్సిన పని లేదు. బాలీవుడ్ మూవీస్ రికార్డులు అన్నింటిని తిరగరాస్తూ సరికొత్త చరిత్ర సృష్టించింది.
హిందీలో ఈ చిత్రం రూ.689.4 కోట్ల వసూళ్లను సాధించింది. ఈ క్రమంలో బాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీగా ఉన్న పఠాన్ (రూ.543.09 కోట్లు) రికార్డును బ్రేక్ చేసింది. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నటించిన పఠాన్ మూవీని యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన సంగతి తెలిసిందే.
Allu Arjun : మరోసారి సంధ్య థియేటర్ కి అల్లు అర్జున్.. ఎందుకంటే..?
తమ సినిమా రికార్డులను బ్రేక్ చేయడం పట్ల యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పందించింది. పుష్ప2 చిత్ర బృందానికి అభినందనలు తెలియజేసింది.రికార్డులున్నది బద్దలవడానికే అని చెప్పింది. ‘మెరుగైన ప్రదర్శన ఇచ్చేలా ప్రతి ఒక్కరినీ కొత్త రికార్డులు ముందుకు నెడతాయి. చరిత్ర పుస్తకాలను తిరగరాస్తున్న పుష్ప-2 చిత్ర బృందానికి శుభాకాంక్షలు. ఇది ఫైరు కాదు వైల్డ్ ఫైరు.’ అంటూ తమ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.
దీనిపై అల్లు అర్జున్ స్పందించారు. ధన్యవాదాలు తెలియజేయారు. పుష్ప2 సాధించిన ఈ రికార్డులను యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించే చిత్రాలు బద్దలు కొడుతుందని తాను ఆశిస్తున్నానని బన్నీ చెప్పారు.
ఇదిలా ఉంటే.. పుష్ప2 మూవీ బుక్ మై షోలో అత్యధిక టికెట్లు అమ్ముడిపోయిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఏకంగా 18 మిలియన్లకు పైగా టికెట్లు బుక్ మై షోలో అమ్ముడుపోయాయి. అంటే ఆల్మోస్ట్ 1.8 కోట్ల టికెట్లు బుక్ అయ్యాయి. ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా టికెట్లు బుక్ మై షోలో ఈ స్థాయిలో అమ్ముడు పోలేదు. ఈ క్రమంలో ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌లో కూడా పుష్ప 2 సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. ఈ విషయాన్ని బుక్ మై షో అధికారికంగా ప్రకటించింది.
Thank you … so graceful . Humbled by your wishes. Thank you , I am touched . May this record soon be broken by a heart-melting #YRF film , and may we all collectively move towards excellence.
— Allu Arjun (@alluarjun) December 23, 2024