అర్హతో బన్నీ ఎక్సర్‌సైజులు చూశారా!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన గారాల పట్టి అర్హతో ఎక్సర్‌సైజులు చేసిన పిక్ వైరల్ అవుతోంది..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన గారాల పట్టి అర్హతో ఎక్సర్‌సైజులు చేసిన పిక్ వైరల్ అవుతోంది..
లాక్‌డౌన్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోయాయి. ప్రజలు, సెలబ్రిటీలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. సినీ సెలబ్రిటీల విషయానికి వస్తే వారు పుస్తకాలు చదువుతూ పిల్లలతో ఆటలాడుకుంటూ సరదాగా సమయాన్ని గడుపుతున్నారు. వర్కౌట్స్, వంట చేయడం వంటి వీడియోలను ప్రేక్షకులతో పంచుకుంటున్నారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తనకు దొరికిన ఖాళీ సమయాన్ని తన పిల్లలు అయాన్, అర్హలతో సరదాగా గడుపుతున్నారు. లేటస్ట్‌గా అర్హతో కలిసి మార్నింగ్ ఎక్సర్‌సైజులు చేసే ఫొటోను ఆయన సతీమణి స్నేహ ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేశారు.
ఆ ఫొటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. కరోనా ప్రభావం లేకుంటే ఈపాటికి బన్నీ, సుకుమార్ కలయికలో రూపొందనున్న హ్యాట్రిక్ చిత్రం‘పుష్ప’ షూటింగ్ జరుగుతుండేది. బన్నీ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. పాన్ ఇండియా సినిమాగా భారీ స్థాయిలో తెరకెక్కనుందీ చిత్రం.