Allu Arjun : ఇది గమనించారా..? అల్లు అర్జున్ సినిమాలతోనే వరుసగా రెండు సంవత్సరాల్లో అవార్డులు..

ఈ ఏడాది జాతీయ చలనచిత్ర అవార్డులు పురస్కారంలో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. అయితే మీరు ఒకటి గమనించారా..?

Allu Arjun : ఇది గమనించారా..? అల్లు అర్జున్ సినిమాలతోనే వరుసగా రెండు సంవత్సరాల్లో అవార్డులు..

Allu Arjun movies ala vaikunthapurramuloo Pushpa movie own national awards in music category

Allu Arjun : 2021 చిత్రాలకు గాను ఈ ఏడాది నేషనల్ అవార్డులను కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు పురస్కారంలో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ఏకంగా 10 సినిమాలు నేషనల్ అవార్డుని అందుకొని సంచలనం సృష్టించాయి. ఇంకో అరుదైన విషయం ఏంటంటే..69 ఏళ్ళగా ఒక ఒక తీరని కలలా ఉన్న బెస్ట్ యాక్టర్ అవార్డుని అల్లు అర్జున్ అందుకొని తెలుగువారి నిరీక్షణకు ముగింపు పలకడంతో ప్రతి ఒక్క తెలుగు అభిమాని ఎంతో సంతోష పడుతున్నాడు.

Allu arjun : బెస్ట్ యాక్ట‌ర్‌గా అల్లు అర్జున్‌.. సుకుమార్ ఆనందం చూశారా..!

కాగా ఈ ఏడాది నేషనల్ అవార్డుల్లో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాకి రెండు అవార్డులు వచ్చాయి. ఒకటి బెస్ట్ యాక్టర్ గా తనకి వస్తే, మరొకటి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) కి వచ్చింది. పుష్ప సినిమాలోని పాటలు ఎంతటి ప్రభంజనం సృష్టించాయి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమధ్య కాలంలో ‘నాటు నాటు’ సాంగ్ తరువాత పుష్పలోని ‘ఊ అంటావా’, ‘శ్రీవల్లి’ సాంగ్ వరల్డ్ వైడ్ గా ఎంతో పాపులారిటీని సంపాదించుకున్నాయి. ఇక ఈ పాటలు ఇంత పాపులర్ అవ్వడానికి దేవిశ్రీ సంగీతంతో పాటు అల్లు అర్జున్ డాన్స్ కూడా కారణం.

M M Keeravani : కీరవాణికి ఇది ఎన్నో నేషనల్ అవార్డు తెలుసా..? తెలుగులో ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ జాతీయ అవార్డు అందుకున్నారు..?

ఇదే కారణంతో క్రిందటి ఏడాది కూడా అల్లు అర్జున్ ఒక నేషనల్ అవార్డుని తెచ్చిపెట్టాడు. గత ఏడాది ‘అల వైకుంఠపురములో’ సినిమాకి థమన్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా పురస్కారం అందుకున్నాడు. ఆ సినిమాలోని ‘బుట్టబొమ్మ’ పాట ఎంత పాపులర్ అయ్యిందో చెప్పనవసరం లేదు. ఇలా వరుసగా రెండు సంవత్సరాల్లో తెలుగు సంగీత దర్శకులకు అవార్డులు తెచ్చిపెట్టడంలో అల్లు అర్జున్ కూడా కీలక పాత్ర పోషించాడు. అసలే పుష్ప 2 మ్యూజిక్ పై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు నేషనల్ అవార్డు రావడంతో ఆ అంచనాలు మరింత పెరిగిపోయాయి.