Allu Arjun : నెక్స్ట్ మూవీలో చెంఘీజ్ ఖాన్ గా బన్నీ?

పుష్ప-2 ప్రమోషన్స్‌లో ఫుల్‌గా బిజీగా ఉన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.

Allu Arjun : నెక్స్ట్ మూవీలో చెంఘీజ్ ఖాన్ గా బన్నీ?

Allu Arjun Next Movie Trivikram Srinivas

Updated On : November 23, 2024 / 10:28 AM IST

పుష్ప-2 ప్రమోషన్స్‌లో ఫుల్‌గా బిజీగా ఉన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పాట్నాలో పుష్ప-2 ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను గ్రాండ్‌ సక్సెస్‌ చేసుకున్న బన్నీ..అప్పుడే నెక్స్ట్ ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. పుష్ప-2 రిలీజ్ తర్వాత కాస్త్‌ రెస్ట్‌ తీసుకుని ఇంకో పెద్ద సినిమా చేయబోతున్నాడట. అందుకోసం ఇప్పటి నుంచే ప్లానింగ్‌ జరుగుతుందంటున్నారు. పుష్ప తర్వాత బన్నీ..త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో మూవీ చేయబోతున్నాడని అంటున్నారు.

ఇది మైథాలజికల్ మూవీ అని కొందరు..హిస్టారికల్ మూవీ అని ఇంకొందరు చెబుతున్నారు. హిస్టారికల్ టచ్‌తో త్రివిక్రమ్ స్టోరీ రాశాడని..అది బన్నికీ బాగా నచ్చిందని మరికొందరు అంటున్నారు. ఏ జానర్‌లో ఉంటుందో తెలియదు కానీ త్రివిక్రమ్, అల్లుఅర్జున్ మూవీ మాత్రం ఫిక్స్ అట. మంగోలియన్ల నాయకుడు చెంఘీజ్ ఖాన్ బయోపిక్‌గా మూవీ రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Zebra : ‘జీబ్రా’ మూవీ రివ్యూ.. బ్యాంకింగ్ వ్యవస్థపై మరో సినిమా..

మంగోలియన్‌ పౌరులందరిని ఏకం చేసి వాళ్లందరితో కలసి శత్రువులతో యుద్దానికి దిగి తన రాజ్యాన్ని కాపాడుకున్న చెంఘీజ్ ఖాన్‌గా అల్లుఅర్జున్ నటించబోతున్నాడని..దీనిని త్రివిక్రమ్ చాలా బాగా రాశాడని టాక్.

అయితే త్రివిక్రమ్, బన్నీ చేయబోయే సినిమాపై బన్నీ వాసు చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. స్టోరీ లైన్ ఫిక్స్ అయిపోయింది..కానీ మూవీకి భారీ బడ్జెట్ అవసరం అని చెప్పాడు బన్నీ వాసు. అంతేకాదు ఫైనాన్సర్లను కూడా వెతకాల్సి వస్తుందని చెప్పుకొచ్చాడు. బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చే ఈ మూవీ ప్రీప్రొడక్షన్ వర్కే ఏడాది పాటు ఉంటుందని చెప్పాడు బన్నీవాసు. మరీ ఈప్రాజెక్టు ఎప్పుడు ట్రాక్‌ ఎక్కబోతుందనేది మాత్రం బన్నీనో, త్రివిక్రమ్‌ శ్రీనివాసో ప్రకటిస్తే తప్ప క్లారిటీ వచ్చేలా లేదు.

Killer : ‘కిల్లర్’ నుంచి పూర్వాజ్ ఫస్ట్ లుక్.. భార్యాభర్తలిద్దరూ కలిసి చేస్తున్న సినిమా..