లారీ డ్రైవర్, బిజినెస్‌మేన్ – రెండు పాత్రల్లో స్టైలిష్ స్టార్

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్న స్టైలిష్ స్టార్..

  • Published By: sekhar ,Published On : February 24, 2020 / 08:44 AM IST
లారీ డ్రైవర్, బిజినెస్‌మేన్ – రెండు పాత్రల్లో స్టైలిష్ స్టార్

Updated On : February 24, 2020 / 8:44 AM IST

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్న స్టైలిష్ స్టార్..

‘అల వైకుంఠపురములో..’ నాన్ బాహుబలి రికార్డ్ క్రియేట్ చేయడంతో ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌. ఇప్పుడు సుకుమార్‌ సినిమాకి డబుల్‌ ఎనర్జీతో ఎంటర్‌ కాబోతున్నాడని తెలుస్తోంది. ‘ఆర్య, ఆర్య 2’ చిత్రాల తర్వాత దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. బన్నీ నటిస్తున్న 20వ సినిమా ఇది.

మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. రష్మికా మందన్నా కథానాయిక. చిత్తూరు జిల్లా నేపథ్యంలో ఎర్రచందనం అక్రమ రవాణా కథాంశంగా ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేయనున్నాడట.

గుబురు గడ్డం, రింగుల జుత్తుతో లారీ డ్రైవర్‌గా ఒక పాత్రలో, స్టైలిష్‌ బిజినెస్‌మేన్‌గా మరో క్యారెక్టర్‌లో కనిపిస్తాడట. సాధారణంగా బన్నీ సినిమాలంటే ఎనర్జీ, దుమ్ములేపే డ్యాన్స్ నెంబర్లు ఉంటాయి.. మరి రెండు పాత్రల్లో బన్నీ కనిపిస్తే కచ్చితంగా డబుల్‌ ఎనర్జీనే అని చెప్పొచ్చు. మార్చి రెండో వారం నుంచి అల్లు అర్జున్, రష్మికా చిత్రీకరణలో పాల్గొననున్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నారు.

Read More>>వాళ్లే నాకు వెన్నుపోటు పొడిచారు: 30ఇయర్స్ పృథ్వీ