Pushpa 2 : రిలీజ్‌కి 15 రోజుల ముందే అమెరికాలో సరికొత్త రికార్డ్ సెట్ చేసిన పుష్ప 2.. ఏ హీరోకి ఈ రికార్డ్ లేదు..

అమెరికాలో అయితే పుష్ప 2 కోసం రిలీజ్ కు చాలా రోజుల ముందు బుకింగ్స్ ఓపెన్ చేశారు.

Pushpa 2 : రిలీజ్‌కి 15 రోజుల ముందే అమెరికాలో సరికొత్త రికార్డ్ సెట్ చేసిన పుష్ప 2.. ఏ హీరోకి ఈ రికార్డ్ లేదు..

Allu Arjun Puhspa 2 Movie Creates New Record in America Here Details

Updated On : November 19, 2024 / 12:25 PM IST

Pushpa 2 : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచారు. పుష్ప 2 సినిమా కోసం ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇక తెలుగు మార్కెట్ కు భారీగా ప్లస్ అయ్యే అమెరికాలో అయితే పుష్ప 2 కోసం రిలీజ్ కు చాలా రోజుల ముందు బుకింగ్స్ ఓపెన్ చేశారు.

Also Read : Allu Arjun : బన్నీ తనలో ఆ విషయం మార్చుకోవాలనుకుంటున్నాడట.. బాలయ్య షోలో బన్నీ ఏం చెప్పాడంటే..

అమెరికాలో ఇప్పటికే బుకింగ్స్ కూడా ఓపెన్ చేయగా తాజాగా 1 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ వసూలు చేసింది. రిలీజ్ కి 15 రోజుల ముందే పుష్ప 2 సినిమా అమెరికాలో 1 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేయడం సరికొత్త రికార్డ్. ఇప్పటివరకు రిలీజ్ కి ఇన్ని రోజుల ముందే ఇంత కలెక్టు చేయడం ఏ హీరోకు లేదు. అమెరికాలో 1 మిలియన్ డాలర్స్ అంటే మంచి కలెక్షన్స్. ఇటీవల చాలా సినిమాలు ఆ రికార్డు సాధిస్తున్నాయి. కానీ రిలీజ్ కి ఇన్ని రోజుల ముందు ఏ సినిమా సాధించలేదు. దీంతో అమెరికాలో అత్యంత వేగంగా 1 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసిన సినిమాగా పుష్ప 2 నిలిచింది. మరి సినిమా రిలీజయ్యాక అమెరికాలో ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడతారో చూడాలి.

Image

అమెరికాలో ఇండియన్ సినిమాల్లో బాహుబలి 2 సినిమా 22 మిలియన్ డాలర్స్ తో, పఠాన్ 17 మిలియన్ డాలర్స్ తో, జవాన్ 15 మిలియన్ డాలర్స్ తో టాప్ 3 పొజిషన్ లో ఉన్నాయి. మరి బన్నీ ఈ రికార్డులని బద్దలు కొడతాడేమో చూడాలి.