Allu Arjun : బన్నీ తనలో ఆ విషయం మార్చుకోవాలనుకుంటున్నాడట.. బాలయ్య షోలో బన్నీ ఏం చెప్పాడంటే..
తాజాగా రిలీజయిన బాలయ్య - అల్లు అర్జున్ అన్‌స్టాపబుల్ ప్రోమోలో..

Allu Arjun wants to Change one thing in his life revealed in Balakrishna Unstoppable Show
Allu Arjun : అల్లు అర్జున్ ఇటీవల బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకి వచ్చి సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎపిసోడ్ కి పార్ట్ 2 కూడా ఉందని ప్రకటించగా తాజాగా నేడు ఈ ఎపిసోడ్ పార్ట్ 2 ప్రోమో రిలీజ్ చేసారు. ఈ ప్రోమో చూస్తుంటే ఈ ఎపిసోడ్ లో కూడా అల్లు అర్జున్ బోలెడన్ని ఆసక్తికర విషయాలు తెలిపినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ప్రోమో ట్రెండ్ అవుతుంది. ఇక ఈ ఎపిసోడ్ పార్ట్ 2 నవంబర్ 22 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
Also Read : Allu Arjun : మాస్ చూశారు.. ఊర మాస్ చూశారు.. ఈసారి.. పుష్ప 2 పై బాలయ్య షోలో బన్నీ కామెంట్స్..
తాజాగా రిలీజయిన బాలయ్య – అల్లు అర్జున్ ప్రోమోలో బాలకృష్ణ.. నీలో నువ్వు మార్చుకుందామనుకుంది ఏంటి అని అల్లు అర్జున్ ని అడగ్గా.. ఇకపై తొందరగా పడుకొని నాలుగున్నర , ఐదు గంటల కల్లా లేవాలి అని సమాధానమిచ్చాడు. దీంతో బన్నీ లేట్ గా పడుకొని లేట్ గా లెగుస్తాడని, అందుకే త్వరగా లెగవడం అలవాటు చేసుకోవాలని, ఈ విషయంలో మారాలని బన్నీ అనుకుంటున్నట్టు తెలుస్తుంది. మీరు కూడా బాలయ్య – అల్లు అర్జున్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ పార్ట్ 2 ప్రోమో చూసేయండి..
ఇటీవలే పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బీహార్ పాట్నాలో గ్రాండ్ గా నిర్వహించి ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కాబోతుండగా దేశవ్యాప్తంగా ఫ్యాన్స్, ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.