Allu Arjun : మాస్ చూశారు.. ఊర మాస్ చూశారు.. ఈసారి.. పుష్ప 2 పై బాలయ్య షోలో బన్నీ కామెంట్స్..
బాలయ్య పుష్ప 2 గురించి అడిగితే అల్లు అర్జున్..

Allu Arjun Interesting Comments on Pushpa 2 Movie in Balakrishna Unstoppable Show
Allu Arjun – Pushpa 2 : అల్లు అర్జున్ – బాలయ్య అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ పార్ట్ ప్రోమో తాజాగా రిలీజ్ చేసారు. దీంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది. ప్రోమో ఆద్యంతం ఫుల్ ఎంటర్టైనింగ్ గా ప్రేక్షకులని మెప్పిస్తుంది. ఈ ఎపిసోడ్ లో కూడా బన్నీ బోలెడన్ని ఆసక్తికర విషయాలు చెప్పినట్టు తెలుస్తుంది.
ఎపిసోడ్ లో బాలయ్య పుష్ప 2 గురించి అడిగితే అల్లు అర్జున్.. మాస్ చూశారు.. ఊర మాస్ చూశారు.. ఈసారి జాతర మాస్ చూస్తారు అని తగ్గేదేలే అంటూ పుష్ప మేనరిజం చూపించాడు. దీంతో బన్నీ కామెంట్స్ తో సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. అలాగే బాలయ్య సినిమా రిలీజ్ కి ముందే 1000 కోట్ల బిజినెస్ అయిందట అని అడిగాడు. దీనికి బన్నీ ఏం సమాధానం చెప్తాడో చూడాలి. ఇటీవల పుష్ప 2 సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 1000 కోట్లు అయిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఎపిసోడ్ లో పుష్ప 2 సినిమా గురించి బన్నీ చాలా విషయాలు చెప్పినట్టు తెలుస్తుంది. ఈ ఎపిసోడ్ నవంబర్ 22 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
ఇటీవలే పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచారు. బీహార్ పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ భారీగా నిర్వహించి నార్త్ లో బన్నీకి, పుష్ప కు ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో ప్రూవ్ చేసారు.