Allu Arha : పదోతరగతి పద్యం అల్లు అర్హ ఎంత ఈజీగా చెప్పిందో.. షాక్ అయిన బాలయ్య.. అర్హకు తెలుగు ఇంత బాగా వచ్చా..

ఈ ఎపిసోడ్ కు అల్లు అర్జున్ పిల్లలు అల్లు అయాన్, అల్లు అర్హ వచ్చి సందడి చేసారు.

Allu Arha : పదోతరగతి పద్యం అల్లు అర్హ ఎంత ఈజీగా చెప్పిందో.. షాక్ అయిన బాలయ్య.. అర్హకు తెలుగు ఇంత బాగా వచ్చా..

Allu Arha Tells Telugu Poem in Balakrishna Unstoppable Show Every One Shocked Watch Promo Here

Updated On : November 19, 2024 / 11:22 AM IST

Allu Arha : బాలకృష్ణ – అల్లు అర్జున్ ఆహా అన్‌స్టాప‌బుల్ ఎపిసోడ్ పార్ట్ 2 ప్రోమో తాజాగా రిలీజ్ చేసారు. ఇటీవల పార్ట్ 1 ఆద్యంతం ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగింది. ఇప్పుడు పార్ట్ 2 ప్రోమో కూడా ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఈ ఎపిసోడ్ కు అల్లు అర్జున్ పిల్లలు అల్లు అయాన్, అల్లు అర్హ వచ్చి సందడి చేసారు. ఇద్దరూ షోలోకి రాగానే బాలయ్య కాళ్లకు నమస్కరించారు. బాలయ్య ఇద్దరినీ దగ్గరికి తీసుకున్నాడు.

షోలో బాలకృష్ణ వీళ్లకు తెలుగు వచ్చా అని అడగడంతో అల్లు అర్హ.. అటజని కాంచె పద్యం చెప్పి బాలయ్యతో సహా షోలో అందర్నీ ఆశ్చర్యపరిచింది. గతంలో పదవతరగతి తెలుగు సబ్జెక్టులో ఉండే పద్యం ‘అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ..’ని అర్హ ఇంత ఈజీగా స్పష్టంగా చెప్పేయడంతో అందరూ తనని మెచ్చుకుంటున్నారు. బాలయ్య అర్హ తెలుగుని చూసి దగ్గరికి తీసుకొని అభినందించారు.

Also Read : Balakrishna – Allu Arjun : అల్లు అర్జున్ – బాలకృష్ణ అన్‌స్టాప‌బుల్ ఎపిసోడ్ పార్ట్ 2 ప్రోమో రిలీజ్.. అల్లు అర్జున్ పిల్లల సందడి చూశారా..

అర్హ అలా తెలుగులో పద్యం చెప్పడం చూసి.. తెలుగు చల్లగా నాలుగు కాలాల పాటు హాయిగా ఈ భూమి మీద బతికి ఉంటుందనిపిస్తుంది అని బాలయ్య అన్నారు. ఇక బన్నీ ఫ్యాన్స్, నెటిజన్లు అర్హ పద్యం చెప్పిన వీడియోని తెగ వైరల్ చేస్తూ అర్హకు తెలుగు ఇంత బాగా వచ్చా అని కామెంట్స్ చేస్తున్నారు.

ఈ జనరేషన్ లో చాలా మంది తెలుగు రాయడమే కాదు మాట్లాడటం కూడా రావట్లేదు. చాలా మంది తెలుగుని ఖూనీ చేస్తున్నారు, అలాంటి వాళ్ళు చిన్న పాప అర్హని చూసి నేర్చుకోవాలి అని నెటిజన్లు, తెలుగు భాషాభిమానులు అంటున్నారు. మీరు కూడా అర్హ తెలుగులో పద్యం ఎంత బాగా చెప్పిందో ఈ ప్రోమోలో చూసేయండి..