Pushpa 2 : ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ చేసుకున్న పుష్ప 2.. ఎందులో అంటే..?

ప్రస్తుతం థియేటర్స్ లో పుష్ప వైల్డ్ ఫైర్ మోత మోగుతుంది.

Pushpa 2 : ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ చేసుకున్న పుష్ప 2.. ఎందులో అంటే..?

Allu Arjun Pushpa 2 movie OTT platform fixed

Updated On : December 5, 2024 / 12:29 PM IST

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన సినిమా పుష్ప 2. నేడు విడుదలైన ఈ సినిమా ప్రీమియర్స్ నిన్న రాత్రి నుండే స్టార్ట్ అయ్యాయి. ప్రస్తుతం థియేటర్స్ లో పుష్ప వైల్డ్ ఫైర్ మోత మోగుతుంది. దాదాపుగా మూడు సంవత్సరాలు షూటింగ్ తర్వాత అల్లు అర్జున్ భారీ సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడంతో థియేటర్స్ వద్ద పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు ఆడియన్స్.

అయితే నేడు థియేటర్స్ లో విడుదలై మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతున్న ఈ సినిమా ఓటీటీ పాట్నర్ ను ఫిక్స్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు పుష్ప 2 స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకునట్టు తెలుస్తుంది. పుష్ప 2 మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతుంది కాబట్టి కాస్త ఆలస్యంగానే ఓటీటీలోకి వస్తుదని అంటున్నారు. మరి ఈ రోజు విడుదలైన ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో చూడాలి.

Also Read : Mansoor Ali Khan Son : డ్రగ్స్ కేసులో ప్రముఖ నటుడి కుమారుడు అరెస్ట్.

ఇక నిన్న రాత్రి ప్రీమియర్స్ వెయ్యడంతో సినిమా చూడడానికి అల్లు అర్జున్ తన భార్య స్నేహతో కలిసి థియేటర్ కి వచ్చాడు. అలాగే పుష్ప రాజ్ శ్రీవల్లి కూడా వచ్చింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి రెస్పాన్స్ కనబరుస్తుండడంతో మూవీ యూనిట్ అంతా ఎంతో సంతోషాన్ని వ్యక్త పరుస్తున్నారు.