Mansoor Ali Khan Son : డ్రగ్స్ కేసులో ప్రముఖ నటుడి కుమారుడు అరెస్ట్.
తాజాగా మన్సూర్ అలీఖాన్ కుమారుడు తుగ్లక్‌ను అలీఖాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Tamil actor Mansoor Ali Khan son arrested in drug case
Mansoor Ali Khan Son : ఎన్నో తమిళ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా పలు సినిమాలు చేశారు. అయితే తాజాగా మన్సూర్ అలీఖాన్ కుమారుడు తుగ్లక్‌ను అలీఖాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెలలో డ్రగ్స్ కేసులో కొందరిని అరెస్ట్ చేసారు పోలీసులు. వాళ్లు ఇచ్చిన సమాచారంతో మన్సూర్ అలీఖాన్ కుమారుడు కూడా ఉండడంతో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
పోలీసుల విచారణలో ఆంధ్రప్రదేశ్ లో గంజాయి కొనుగోలు చేసి చెన్నైలోని కటంగొళత్తూరులోని ఓ ప్రైవేట్ కాలేజీ స్టూడెంట్స్ కి అమ్ముతున్నట్టు సమాచారం. మెథాంఫెటమిన్ రకం డ్రగ్స్ కొంటున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అంతేకాదు మన్నాడికి చెందిన మహమ్మద్, జయముజీన్‌లు ఈ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు విచారణలో తేలింది.
డ్రగ్ కార్టెల్‌లో కీలక సభ్యుడైన జిదాన్ జుబీన్‌ను ముందు అరెస్టు చేశారు పోలీసులు. ఆ తర్వాత దర్యాప్తు చేశారు. అతని సమాచారం ఆధారంగా, బృందం మంగళవారం అలీ ఖాన్ తుగ్లక్, ఇతర నిందితులను ట్రాక్ చేసి పట్టుకున్నారు. అనంతరం అలీఖాన్ తుగ్లక్ ని దాదాపు 12 గంటల పాటు విచారించారు పోలీసులు. నటుడి కుమారుడితో పాటు మరో 7 మందిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేసినట్టు సమాచారం.