Allu Arjun Pushpa 2 Movie OTT Release Date Rumours Competing with Game Changer
Game Changer – Pushpa 2 : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ఇటీవల డిసెంబర్ 5న థియేటర్స్ లో రిలీజయి భారీ హిట్ అయింది. ఇప్పటికే ఈ సినిమా ఆల్మోస్ట్ 1200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. థియేటర్స్ లో ఈ సినిమా రిలీజయి పది రోజులు దాటుతున్నా ఇంకా దూసుకెళ్తుంది. టికెట్ రేట్లు భారీగా ఉండటంతో కొంతమంది మాత్రం ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.
పుష్ప 2 సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలోకి వస్తుందని ఆల్రెడీ సినిమాతోనే అనౌన్స్ చేశారు. దీంతో ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవల మ్యాగ్జిమమ్ ఎంత పెద్ద సినిమా అయినా రిలీజయిన నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తుంది. బాగా హిట్ అయిన సినిమాలు, పెద్ద సినిమాలు కొన్ని మాత్రం 5 వారాలు లేదా ఆరు వారాలు గ్యాప్ తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో పుష్ప 2 సినిమా 5 వారాల తర్వాత నెట్ ఫ్లిక్స్ ఓటీటీలోకి వస్తుందని సమాచారం.
ఈ లెక్కన జనవరి 9వ తేదీన పుష్ప 2 సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలోకి వస్తుందని సమాచారం. అయితే జనవరి 10న గేమ్ ఛేంజర్ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఒక రోజు ముందే ప్రీమియర్స్ ఉంటాయి కాబట్టి థియేటర్స్ లో గేమ్ ఛేంజర్ సినిమా రిలీజయ్యే సమయానికి ఓటీటీలో పుష్ప 2 సినిమా రిలీజవుతుందని తెలుస్తుంది. థియేటర్స్ లో మంచి రికార్డులు సెట్ చేస్తున్న పుష్ప 2 ఓటీటీలో ఎన్ని రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి.