Pushpa 2 : పుష్ప 2 టీజర్ అచ్చం దింపేసిన బుడ్డోడు.. అల్లు అర్జున్ ఇది చూడాలంటున్న ఫాన్స్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా మరో 3 రోజుల్లో రిలీజ్ కావడానికి రెడీగా ఉంది.

Pushpa 2 : పుష్ప 2 టీజర్ అచ్చం దింపేసిన బుడ్డోడు.. అల్లు అర్జున్ ఇది చూడాలంటున్న ఫాన్స్..

Allu Arjun Pushpa 2 movie teaser spoof by small kid video goes viral

Updated On : December 1, 2024 / 3:29 PM IST

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా మరో 3 రోజుల్లో రిలీజ్ కావడానికి రెడీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుండి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

Also Read : Vignesh Sivan : ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేసిన విఘ్నేష్.. ధనుష్ వల్ల జరిగిన ఆ అవమానమే కారణమా..

అయితే తాజాగా పుష్ప 2 టీమ్ కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు ఓ బుడ్డోడు. పుష్ప 2 టీజర్ ను అచ్చం అలానే ఉన్నట్టు షూట్ చేసి ఓ వీడియో షేర్ చేసారు. చతుర్ అనే పిల్లాడు పుష్పగా ఇందులో కనిపించాడు. అచ్చం అల్లు అర్జున్ లా జాతర ఎపిసోడ్ కి రెడీ అయినట్టు తయారయ్యాడు. అదే యాటిట్యూడ్ తో నటించి అదరగొట్టాడు. అలాగే చివరిలో ఈ టీజర్ సంతోష్ ముత్యాలయ దర్శకత్వంలో వచ్చిందని పేర్కొన్నారు.


మొత్తానికి బన్నీలా చతుర్ అదరగొట్టడంతో అల్లు అర్జున్ ఫాన్స్ భలే చేసావని కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో బన్నీ దాకా చేరాలని అంటున్నారు. ఇప్పటికే కొంత మంది చిన్నారులు పలువురు స్టార్ హీరో సినిమాల స్పూఫ్ చేసారు. యూట్యూబ్ లో ఆ వీడియోలకు మంచి స్పందన కూడా లభించింది. ఇక ఇప్పుడు చతుర్ చేసిన ఈ వీడియో బన్నీ దాకా చేరుతుందా లేదా చూడాలి.