Allu Arjun : తెలుగు ఇండియన్ ఐడల్ ఫైనల్ ప్రోమో వచ్చేసింది.. అల్లు అర్జున్ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరు తెలుసా?

తెలుగు ఇండియన్ ఐడల్ ఫైనల్స్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ ఫైనల్స్ కి గెస్ట్ గా వచ్చిన అల్లు అర్జున్.. తన ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరుని రివీల్ చేశాడు.

Allu Arjun : తెలుగు ఇండియన్ ఐడల్ ఫైనల్ ప్రోమో వచ్చేసింది.. అల్లు అర్జున్ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరు తెలుసా?

Allu Arjun reveals his girlfriend name at Telugu Indian Idol show

Updated On : May 28, 2023 / 5:24 PM IST

Allu Arjun Telugu Indian Idol : ప్రముఖ ఓటీటీ ఆహాలో ప్రసారమవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ (Telugu Indian Idol) సీజన్ 2 ఫైనల్ కి చేరుకుంది. గత సీజన్ ఫైనల్స్ కి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) గెస్ట్ గా రాగా.. ఈ ఫైనల్స్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అతిథిగా వచ్చాడు. తాజాగా ఈ ప్రోమోని షో నిర్వాహకులు రిలీజ్ చేశారు. ఈ ఫైనల్ ఎపిసోడ్స్ లో మొత్తం అల్లు అర్జున్ సాంగ్స్ పాడి అదరగొట్టబోతున్నారు. ఇక ఈ షోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన బన్నీ.. ఫుల్ ఆన్ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ కి కనిపించబోతున్నాడు.

Allu Arjun : నాకు అన్ని ఇచ్చింది ఆయనే.. నాకు ఆయనే దేవుడు.. అల్లు అర్జున్!

ఈ సీజన్ 2 ఫైనల్స్ కి మొత్తం 5 కంటెస్టెంట్స్ చేరుకున్నారు. కాగా ఈ ఎపిసోడ్ లో అల్లు అర్జున్ తన ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరు తెలియజేశాడు. ఫైనల్ కి వచ్చిన కంటెస్టెంట్స్ లో శ్రుతి అనే అమ్మాయి ఉంది. ఆమెతో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. “నీ పేరు అంటే నాకు చాలా ఇష్టం. నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరు కూడా శ్రుతినే” అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు షో మొత్తంలో అల్లు అర్జున్ శ్రుతి పేరుని తీసుకు వస్తూనే ఉన్నాడు. దీంతో షో మొత్తం ఫుల్ ఎంటర్టైన్ గా జరిగింది. ఈ షో జూన్ 3, 4 తేదీల్లో ప్రసారం కానుంది.

Vishwak Sen : విశ్వక్ సేన్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్.. తెలుగోడి ఆత్మగౌరవం ఎన్టీఆర్ అంటున్న విశ్వక్!

ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్న సంగతితెలిసిందే. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తుండగా ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) విలన్ గా కనిపించబోతున్నాడు. పుష్ప 1 సూపర్ హిట్ అవ్వడంతో ఈ సెకండ్ పార్ట్ పై పాన్ ఇండియా వైడ్ భారీ అంచనాలు నెలకొన్నాయి.