Allu Arjun : తెలుగు అమ్మాయిలు సినిమాలు చెయ్యట్లేదు.. అమ్మాయిలూ.. సినిమా ఇండస్ట్రీకి రండి..
బేబీ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఈవెంట్ లో బన్నీ ఆల్మోస్ట్ అరగంటకు పైగా మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ నేపథ్యంలో తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా లేరు అని మాట్లాడారు.

Allu Arjun says to females come to Telugu Movie Industry in Baby Movie Appreciation event
Allu Arjun : SKN నిర్మాణంలో సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin), ప్రధాన పాత్రల్లో వచ్చిన బేబీ సినిమా జులై 14న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజయి భారీ విజయం సాధించింది. ఇప్పటికే ఈ సినిమా ఏకంగా 45 కోట్లకు పైగా కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ప్రేక్షకులు మాత్రమే కాక స్టార్ సెలబ్రిటీలు కూడా బేబీ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ స్వయంగా సినిమా చూసి బేబీ సినిమాని అభినందించడానికి ప్రత్యేకంగా ఈవెంట్ పెట్టాడు.
ఈ ఈవెంట్ లో బేబీ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఈవెంట్ లో బన్నీ ఆల్మోస్ట్ అరగంటకు పైగా మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచారు. హీరోయిన్ వైష్ణవి గతంలో అల్లు అర్జున్ కి చెల్లెలిగా అలవైకుంఠపురంలో సినిమాలో నటించి మెప్పించింది. దీంతో వైష్ణవి గురించి ప్రత్యేకంగా మాట్లాడి బేబీ సినిమాలో చాలా బాగా చేశావని అభినందించారు. తెలుగు అమ్మాయి హీరోయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. ఈ నేపథ్యంలో తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా లేరు అని మాట్లాడారు.
Allu Arjun : పుష్ప 2 నుంచి డైలాగ్ లీక్ చేసిన బన్నీ..
అల్లు అర్జున్ మాట్లాడుతూ.. తెలుగులో అమ్మాయిలు వచ్చి సినిమాలు చెయ్యట్లేదు. ఒక అవార్డు ఈవెంట్ కి వెళ్తే మలయాళం, తమిళ్, కన్నడ హీరోయిన్స్ వాళ్ళ భాషల్లో వాళ్ళు అవార్డులు తీసుకుంటున్నారు. కానీ ఒక్క తెలుగు అమ్మాయి కూడా తెలుగు పరిశ్రమ నుంచి లేదు. ఈ బాధ నాకు ఎప్పట్నుంచో ఉంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వైష్ణవి స్పీచ్ చూశాను. ఆ అమ్మాయి సక్సెస్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తెలుగు అమ్మాయిలు వచ్చి సినిమాలు చేయాలి. అమ్మాయిలు భయపడక్కర్లేదు, రండి, సినిమా ఇండస్ట్రీకి వచ్చి సినిమాలు చేయండి. మీ పేరెంట్స్ ని ఒప్పించి సినిమా ఇండస్ట్రీకి రండి. ఇక్కడ చాలా అవకాశాలు ఉన్నాయి. ఎవరి భాషలో వాళ్లే బాగుంటారు. వైష్ణవి బెస్ట్ యాక్టర్ అవార్డు కొట్టాలి. తను అవార్డు కొడితే చాలా మందికి ఇన్స్పిరేషన్ వస్తుంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎవ్వరైనా రావచ్చు. ముఖ్యంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు డిమాండ్ చాలా ఉంది. ఇండస్ట్రీకి అందరూ రావచ్చు అని మాట్లాడారు. దీంతో బన్నీ స్పీచ్ వైరల్ గా మారింది. మరి బన్నీ స్పీచ్ విని ఇండస్ట్రీకి ఎంతమంది కొత్త అమ్మాయిలు వస్తారో చూడాలి.