Allu Arjun : పుష్ప 2 నుంచి డైలాగ్ లీక్ చేసిన బన్నీ..

ఈవెంట్ కి వచ్చిన ఫ్యాన్స్ అంతా పుష్ప 2 సినిమా గురించి అడగడంతో ఆ సినిమా నుంచి ఓ డైలాగ్ చెప్పి అందర్నీ మెప్పించారు బన్నీ.

Allu Arjun : పుష్ప 2 నుంచి డైలాగ్ లీక్ చేసిన బన్నీ..

Allu Arjun leaked Pushpa 2 Movie Dialogue in Baby success meet

Updated On : July 21, 2023 / 7:43 AM IST

Allu Arjun :  ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin), ప్రధాన పాత్రల్లో SKN నిర్మాణంలో సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన బేబీ సినిమా జులై 14న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజయి భారీ విజయం సాధించింది. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకొని సూపర్ హిట్ కొట్టి ఇప్పటికే ఏకంగా 45 కోట్లకు పైగా కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

ప్రేక్షకులు మాత్రమే కాదు స్టార్ సెలబ్రిటీలు కూడా బేబీ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. విజయ్ దేవరకొండ, అల్లు అరవింద్, రవితేజ, నాగబాబు, రష్మిక, మెహరీన్, రాశిఖన్నా, సుకుమార్.. లాంటి పలువురు స్టార్స్ బేబీ సినిమాని మెచ్చుకున్నారు. తాజాగా అల్లు అర్జున్ స్వయంగా సినిమా చూసి బేబీ సినిమాని అభినందించడానికి ప్రత్యేకంగా ఈవెంట్ పెట్టాడు.

ఇక ఈ ఈవెంట్ లో బేబీ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఈవెంట్ లో ఆల్మోస్ట్ అరగంటకు పైగా మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇక స్పీచ్ అయిపోయిన అనంతరం ఈవెంట్ కి వచ్చిన ఫ్యాన్స్ అంతా పుష్ప 2 సినిమా గురించి అడగడంతో ఆ సినిమా నుంచి ఓ డైలాగ్ చెప్పి అందర్నీ మెప్పించారు బన్నీ.

Project K  : ప్రాజెక్ట్ K గ్లింప్స్, టైటిల్ రిలీజ్.. కలియుగాంతం దేవుడు కల్కి వచ్చేశాడు..

బన్నీ మాట్లాడుతూ.. పుష్ప 2 డైలాగ్ కావాలా? ఇప్పుడు లీక్ చేయాలా.. చిరు లీక్స్ కంటే పెద్దది అయిపోద్దేమో. నేను చెప్తా అనుకోలేదు కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. సినిమా పేరు పుష్ప 2 ది రూల్. సినిమాలో ఒక్కటే ఉంటుంది. ఈడ నడుస్తుందంతా ఒక్కటే రూల్. పుష్ప గాడి రూల్ అని చెప్పారు. దీంతో ఈ డైలాగ్ వైరల్ గా మారింది.