Chiranjeevi – Allu Arjun : చిరంజీవి గారు అప్పట్లోనే మమ్మల్ని ఫారెన్ కి తీసుకెళ్లి.. మెగాస్టార్ తో ఉన్న రిలేషన్ గురించి చెప్పిన బన్నీ..
తాజాగా బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోలో చిరంజీవి ప్రస్తావన రాగా అల్లు అర్జున్ మాట్లాడుతూ..

Allu Arjun Shares about Relationship with Megastar in Balakrishna Unstoppable Show
Chiranjeevi – Allu Arjun : అల్లు అర్జున్ బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకి గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ ఎపిసోడ్ పార్ట్ 1 ఫుల్ ట్రెండ్ అవ్వగా ఇప్పుడు పార్ట్ 2 వచ్చింది. ఈ ఎపిసోడ్ లో కూడా అల్లు అర్జున్ – బాలయ్య కలిసి సందడి చేసారు. బాలయ్య అనేక ప్రశ్నలు అడిగి బన్నీతో సమాధానం చెప్పించారు.
అల్లు అర్జున్ తన మామయ్య చిరంజీవి చేతుల మీదుగా లాంచ్ అయి ఆయన్ని చూసే డ్యాన్స్ నేర్చుకొని కష్టపడి ఎదుగుతూ ఇప్పుడు నేషనల్ స్టార్ అయ్యాడని తెలిసిందే. గతంలో అనేకసార్లు అల్లు అర్జున్ తనకు చిరంజీవి ఫ్యాన్ అని, చిరంజీవి అంటే చాలా ఇష్టం అని చెప్పారు.
Also Read : Sreeleela : ‘కిస్సిక్’ సాంగ్ విడుదలకి ముందు వారణాసిలో శ్రీలీల పూజలు..
తాజాగా బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోలో చిరంజీవి ప్రస్తావన రాగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. నాకు 20 ఏళ్ళ అప్పట్నుంచి నా రిలేషన్ మెగాస్టార్ తో ఎలా ఉంటుందో అందరికి తెలుసు. నాకు చిరంజీవి గారంటే చాలా ఇష్టం. కానీ 20 ఏళ్ళ ముందు చిరంజీవి గారితో నేను ఎలా ఉన్నానో ఎవ్వరికి తెలీదు. చిన్నపట్నుంచి ఆయన్ని చూస్తూ ఉన్నాను. హీరోగా కంటే ఒక మంచి వ్యక్తిగా నేను ఆయనకు ఫ్యాన్ అయ్యాను. చిరంజీవి లోని మనిషికి ఫ్యాన్ అయిన తర్వాతే మెగాస్టార్ కి ఫ్యాన్ అయ్యా. మమ్మల్ని మొదటిసారి ఫారెన్ తీసుకెళ్లింది చిరంజీవి గారే. మాములుగా అనుకుంటే చిరంజీవి గారు, ఆయన భార్య, వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లొచ్చు. కానీ నన్ను, శిరీష్ ని, ఇంకొంతమంది పిల్లల్ని ఆ రోజుల్లోనే ఫారెన్ తీసుకెళ్లి మా అందరితో ఎంజాయ్ చేసి తీసుకొచ్చారు. నాకు చిన్నప్పట్నుంచి చిరంజీవి గారంటే ఇష్టం. ఆయన్ని మేము చిక్ బాబాయ్ అని పిలుస్తాం అంటూ మెగాస్టార్ తో ఉన్న రిలేషన్ గురించి చెప్పాడు బన్నీ. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.