Pushpa 2 : పుష్ప 2 VFX వీడియో చూశారా..? సినిమా మొత్తం గ్రాఫిక్సే కదరా.. వీడియో వైరల్..
పుష్ప 2 సినిమాలో గ్రాండియర్ సీన్స్ చాలా ఉన్నాయి.

Allu Arjun Sukumar Pushpa 2 Movie VFX Breakdown Video Released
Pushpa 2 : సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక జంటగా వచ్చిన పుష్ప 2 సినిమా ఎంత భారీ విజయం సాధించిందో అందరికి తెల్సిందే. పాన్ ఇండియా వైడ్ రిలీజయి 1850 కోట్లకు పైగా కలెక్ట్ చేసి బాహుబలి రికార్డులను సైతం బ్రేక్ చేసింది ఈ సినిమా. పుష్ప 2 సినిమా హిట్ తో బన్నీ క్రేజ్ మరింత పెరిగింది.
పుష్ప 2 సినిమాలో గ్రాండియర్ సీన్స్ చాలా ఉన్నాయి. సినిమాలో గాఫిక్స్, VFX వాడారని తెలుసు. అయితే తాజాగా పుష్ప 2 మూవీ యూనిట్ ఈ సినిమా VFX బ్రేక్ డౌన్ అంటూ ఓ వీడియో రిలీజ్ చేసారు. ఈ వీడియోలో సినిమాలో చాలా సీన్స్ మొత్తం VFX తోనే చేసినట్టు చూపించారు.
Also See : Pooja Hegde : చాన్నాళ్లకు చీరకట్టులో క్యూట్ గా పూజ హెగ్డే.. ఫోటోలు వైరల్..
దీంతో ఈ వీడియో చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు. సినిమా అంతా VFX, గ్రాఫిక్స్ తోనే చేసారు కదరా అని కామెంట్స్ చేస్తున్నారు. గ్రాఫిక్స్ తో భలే మాయ చేశారే, మొత్తం రియల్ అని నమ్మించేలా బాగా VFX చేసారు అని నెటిజన్లు, ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి పుష్ప 2 VFX బ్రేక్ డౌన్ వీడియో వైరల్ గా మారింది. మీరు కూడా ఈ వీడియో చూసేయండి..
ఇక పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ఇటీవలే అట్లీతో సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.