Allu Arjun : జవాన్ పై అల్లు అర్జున్ ట్వీట్.. షారుక్ ఖాన్ మాస్ అవతార్ అంటూ..

షారుఖ్ ఖాన్ జవాన్ పై అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్. షారుక్ ఖాన్ మాస్ అవతార్ అంటూ..

Allu Arjun : జవాన్ పై అల్లు అర్జున్ ట్వీట్.. షారుక్ ఖాన్ మాస్ అవతార్ అంటూ..

Allu Arjun tweet on Shah Rukh Khan Jawan movie

Updated On : September 14, 2023 / 11:03 AM IST

Allu Arjun – Jawan : తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్ లో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నటించిన జవాన్ (Jawan) బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. షారుఖ్ డ్యూయల్ రోల్ చేసిన ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా నటించగా విజయ్ సేతుపతి విలన్ గా కనిపించాడు. దీపికా పదుకొనె అతిథి పాత్రలో కనిపించింది. ఇక మూవీలో అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ షారుఖ్ స్క్రీన్ ప్రెజన్స్ కి అభిమానులు మాత్రమే కాదు సెలబ్రిటీస్ సైతం ఫిదా అవుతున్నారు. ఈక్రమంలోనే ఈ మూవీ చూసిన మహేష్ బాబు, రాజమౌళి.. జవాన్ పై పొగడ్తల వర్షం కురిపిస్తూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

Harsha Sai : హీరోగా యూట్యూబర్ హర్ష సాయి.. నిర్మాతగా బిగ్‌బాస్ బ్యూటీ..

తాజాగా అల్లు అర్జున్ కూడా జవాన్ పై ట్వీట్ చేశాడు. జవాన్ పూర్తి షారుఖ్ మాస్ అవతార్ అని, మూవీలో షారుఖ్ స్వాగ్ చూసి ఫిదా అయ్యినట్లు బన్నీ రాసుకొచ్చాడు. అలాగే విజయ్ సేతుపతి, నయనతార, దీపికా నటన గురించి, అనిరుద్ మ్యూజిక్ గురించి ప్రశంసించాడు. ఇక కమర్షియల్ సినిమాతో నేషనల్ వైడ్ సునామీ సృష్టించిన దర్శకుడు అట్లీని అభినందించాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. కాగా అట్లీ ఇటీవల అల్లు అర్జున్ కి కూడా ఒక కథ వినిపించాడట. ప్రస్తుతం ఈ మూవీ చర్చలు జరుగుతున్నాయి.

Vishal : ఆ దర్శకుడితో కలిసి అసలు పని చేయను..

ఈ విషయాన్ని డైరెక్టర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఒకవేళ ఆ కథ ఒకే అయితే.. త్వరలోనే పట్టాలు ఎక్కే ఛాన్స్ ఉంది. ఇక జవాన్ కలెక్షన్స్ విషయానికి వస్తే.. మొదటి నాలుగు రోజులు 100 కోట్ల కలెక్షన్స్ తెచ్చిపెట్టిన మూవీ.. ప్రస్తుతం రోజుకు 20 కోట్లు మాత్రమే రాబడుతుంది. రానున్న రోజుల్లో బాక్స్ ఆఫీస్ వద్ద ఇతర సినిమాలు ఉండడం వల్ల కలెక్షన్స్ మరింత తగ్గే అవకాశం ఉంది.