Allu Arjun : నేడు కిమ్స్ ఆస్ప‌త్రికి అల్లు అర్జున్‌..

సినీ న‌టుడు అల్లు అర్జున్ నేడు (మంగ‌ళ‌వారం జ‌న‌వ‌రి 7) బేగంపేట కిమ్స్ ఆస్ప‌త్రికి వెళ్ల‌నున్నారు

Allu Arjun : నేడు కిమ్స్ ఆస్ప‌త్రికి అల్లు అర్జున్‌..

Allu Arjun will go to kims hospital today

Updated On : January 7, 2025 / 9:01 AM IST

సినీ న‌టుడు అల్లు అర్జున్ నేడు (మంగ‌ళ‌వారం జ‌న‌వ‌రి 7) బేగంపేట కిమ్స్ ఆస్ప‌త్రికి వెళ్ల‌నున్నారు. సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో తీవ్రంగా గాయ‌ప‌డిన బాలుడు శ్రీతేజ్ ప్ర‌స్తుతం కిమ్స్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. శ్రీతేజ్‌ను ప‌రామ‌ర్శించేందుకు అల్లు అర్జున్ ఆస్ప‌త్రికి వెళ్ల‌నున్నారు.

కాగా.. కిమ్స్ ఆస్ప‌త్రికి వెళ్లే ముందు త‌మ‌కు స‌మాచారం ఇవ్వాల‌ని ఇప్ప‌టికే రాంగోపాల్ పేట పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో నేడు తాను ఆస్ప‌త్రికి వెలుతున్న‌ట్లు రాంగోపాల్ పేట పోలీసులకు అల్లు అర్జున్ తెలియ‌జేశారు.

అనిల్ రావిపూడి వాళ్ళ నాన్న RTC డ్రైవర్.. అనిల్ రావిపూడి తండ్రిని పరిచయం చేసిన దిల్ రాజు..

ఇదిలా ఉంటే.. సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయిన సంగతి తెలిసిందే. తొక్కిస‌లాట ఘ‌ట‌నపై రాంగోపాల్ పేట పోలీసులు కేసు న‌మోదు చేశారు. అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసి నాంపల్లికోర్టులో హాజ‌రుప‌రిచారు. నాంప‌ల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించ‌గా అదే రోజు అల్లు అర్జున్ న్యాయ‌వాదులు హైకోర్టును ఆశ్ర‌యించారు. హైకోర్టు మ‌ధ్యంత‌ర బెయిల్ మంజూరు చేసింది.

రిమాండ్ గ‌డువు ముగిసిన త‌రువాత అల్లు అర్జున్ వ‌ర్చువ‌ల్‌గా నాంప‌ల్లి కోర్టుకు హాజ‌రు అయ్యాడు. రెగ్యుల‌ర్ బెయిల్ కోసం పిటిష‌న్ దాఖ‌లు చేశారు. నాంప‌ల్లి కోర్టు అల్లు అర్జున్‌కు ష‌ర‌తుల‌తో కూడిన రెగ్యుల‌ర్ బెయిల్‌ను మంజూరు చేసింది.

Chiranjeevi : మొన్న పవన్ కళ్యాణ్ ఇంటికొచ్చినప్పుడు.. అన్నయ్య నువ్వన్న మాట నిజమైంది అని..

కాగా.. ఇప్ప‌టికే పుష్ప‌2 మూవీ టీమ్ రేవ‌తి కుటుంబానికి ఆర్థిక సాయం అందించింది. హీరో అల్లు అర్జున్ రూ.కోటీ రూపాయ‌లు, నిర్మాత‌లు రూ.50ల‌క్ష‌లు, ద‌ర్శ‌కుడు సుకుమార్ రూ.50ల‌క్ష‌ల చొప్పున ఆర్థిక సాయం చేశారు.