Chiranjeevi : మొన్న పవన్ కళ్యాణ్ ఇంటికొచ్చినప్పుడు.. అన్నయ్య నువ్వన్న మాట నిజమైంది అని..
తాజాగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Megastar Chiranjeevi interesting Comments on his Family and Pawan Kalyan
Megastar Chiranjeevi : మెగాస్టార్ – పవర్ స్టార్ అన్నదమ్ముల బంధం ఎంత బాగుంటుందో అందరికి తెలిసిందే. తమ్ముడికి అన్న అంటే దైవంతో సమానం. అన్నయ్యకు తమ్ముడంటే ప్రేమ. ఒకరి గురించి ఒకరు ఎప్పుడూ మాట్లాడినా ఎంతో గొప్పగా చెప్తారు. పవన్ – చిరంజీవి కలిసి కనిపించారంటే మెగా ఫ్యాన్స్ కి పండగే. మెగా ఫ్యామిలీలో జరిగే ఈవెంట్స్ కి చాలా రేర్ గా పవన్ హాజరవుతారు.
ఇటీవల ఎన్నికల్లో గెలిచాక పవన్ అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్న వీడియోలు, ఆ రోజు సెలబ్రేషన్స్ ఏ మెగా ఫ్యాన్ లైఫ్ లాంగ్ మర్చిపోడు. ఇక ప్రమాణ స్వీకారం రోజు అయితే పీఎం నరేంద్రమోడీ అన్నదమ్ములిద్దర్నీ దగ్గరకు తీసుకుంటే చిరంజీవి పవన్ ని చూసి మురిసిపోయారు. ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది. ఇటీవల గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా పవన్ అన్నయ్య చిరంజీవి గురించి గొప్పగా మాట్లాడారు.
Also Read : Kevvu Karthik : పుష్ప గంగమ్మ జాతర గెటప్ లో జబర్దస్త్ నటుడు.. త్వరలో స్కిట్?
అయితే తాజాగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. చిరంజీవి ఓ NRI ఈవెంట్లో పాల్గొని మాట్లాడుతూ.. మొన్న పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చినప్పుడు అన్నయ్య నువ్వొక మాట అనేవాడిని గుర్తుందా.. మన ఇంట్లో ఇంత మంది మీరున్నందుకు, ఈ అవకాశం నాకు భగవంతుడు ఇచ్చినందుకు, ఇది నాతో ఆగిపోకూడదు. ఒక రాజ్ కపూర్ ఫ్యామిలీలో ఎంత మంది ఎలా ఉన్నారో, ఆ రకంగా మరో రాజ్ కపూర్ ఫ్యామిలీలా మన మెగా ఫ్యామిలీ కావాలని నువ్వు చెప్పావు అని గుర్తుచేశాడు. ఈ రోజు నీ మాట మంత్రంలాగా పని చేసింది. నువ్వు కన్విక్షన్‌తో అంటావు. అందులో ఎలాంటి పొల్యూషన్ ఉండదు అందుకే జరిగింది అని అన్నాడు అని తెలిపారు.
అలాగే .. ఈ మధ్య ఓ పత్రిక కూడా కపూర్ ఫ్యామిలీ ఆఫ్ సౌత్ అని మా గురించి ప్రస్తావించినప్పుడు.. భగవంతుడా.. ఇది నా గొప్పదనం కాదు నువ్వు, ప్రేక్షకులు, అభిమానులు ఇలా ఆదరించారు కాబట్టే ఇక్కడున్నామని అనుకున్నాను అని అన్నారు మెగాస్టార్. దీంతో చిరంజీవి వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. నిజంగానే మెగా ఫ్యామిలీ కపూర్ ఫ్యామిలీ ఆఫ్ సౌత్ అని చెప్పొచ్చు.
ఇటీవలే కపూర్ ఫ్యామిలీ అంతా ఒకేచోట చేరి రాజ్ కపూర్ శతజయంతిని జరుపుకున్నారు. కపూర్ ఫ్యామిలిలో అంతా సినీ పరిశ్రమ, పలు రంగాల్లో సక్సెస్ అయినట్టే మెగా ఫ్యామిలీ కూడా అందరూ సినీ పరిశ్రమలో, బయటి రంగాల్లో సక్సెస్ అయ్యారు.