Allu Family : అల్లు ఫ్యామిలీ ఫొటో వైరల్.. ఎవరెవరు ఉన్నారంటే.. అల్లు శిరీష్ కి కాబోయే భార్యని చూశారా?

దీపావళి పండగను అల్లు ఫ్యామిలీ ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. (Allu Family)

Allu Family : అల్లు ఫ్యామిలీ ఫొటో వైరల్.. ఎవరెవరు ఉన్నారంటే.. అల్లు శిరీష్ కి కాబోయే భార్యని చూశారా?

Allu Family

Updated On : October 21, 2025 / 6:15 PM IST

Allu Family : అల్లు శిరీష్ ఇటీవల నయనిక అనే అమ్మాయిని ప్రేమించానని, తనతో నిశ్చితార్థం చేసుకోబోతున్నట్టు, ఇరు కుటుంబాలు తమ ప్రేమకు అంగీకరించాయి అని తెలిపాడు. అయితే నయనిక ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు. దీంతో ఆ నయనిక ఎవరా అని తెగ వెతికేసారు. అయితే ఇప్పుడు అనుకోకుండా ఆమె ఫొటో రివీల్ అయిపోయింది.(Allu Family)

దీపావళి పండగను అల్లు ఫ్యామిలీ ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. అల్లు అర్జున్ భార్య స్నేహ పండగ పూట ఫ్యామిలీతో కలిసి దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ క్రమంలో అల్లు ఫ్యామిలీ అందరూ ఉన్న ఫొటోని షేర్ చేసింది. ఇందులో అల్లు శిరీష్ చేసుకోబోయే భార్య నయనిక కూడా ఉండటం గమనార్హం.

Also See : Allu Arjun : ఫ్యామిలీతో అల్లు అర్జున్ దీపావళి.. స్పెషల్ ఫొటోలు వైరల్..

అయితే నయనిక ఫొటో బయటకు రావడంతో వెంటనే నయనిక ఫేస్ కనపడకుండా ఆమె వరకు కట్ చేసి ఫొటో రీ అప్లోడ్ చేసింది అల్లు స్నేహ. కానీ అప్పటికే ఈ ఫ్యామిలీ ఫొటో వైరల్ అయి నయనిక ఫేస్ రివీల్ అయిపోయింది. దీంతో అల్లు శిరీష్ చేసుకోబోయే అమ్మాయి ఈమెనే అంటూ నయనిక ని వైరల్ చేస్తున్నారు.

Allu Family

ఇక అల్లు ఫ్యామిలీ ఫొటోలో.. అల్లు అరవింద్, ఆయన భార్య నిర్మల, అల్లు బాబీ, అతని వైఫ్, పిల్లలు, అల్లు అర్జున్, అల్లు స్నేహ రెడ్డి, అల్లు అయాన్, అర్హ, అల్లు శిరీష్, శిరీష్ కి కాబోయే భార్య నయనిక ఉన్నారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఈ ఫ్యామిలీ ఫొటోని తెగ వైరల్ చేస్తున్నారు.

Also See : Manchu Family : దీపావళి స్పెషల్.. మంచు ఫ్యామిలీ ఫొటోలు.. ఎవరెవరు ఉన్నారంటే..

Allu Family