Allu Sirish: ఊర్వశివో రాక్షసివో అంటూ ప్రేయసితో సరసాలాడుతోన్న మెగా హీరో!
మెగా హీరో అల్లు శిరీష్ ఇటీవల సినిమాల సంఖ్యను చాలా తగ్గించాడు. ఆయన నటించిన ‘ABCD’ మూవీ రిలీజ్ అయ్యి మూడేళ్లు అవుతోంది. ఆ తరువాత శిరీష్ తన నెక్ట్స్ చిత్రాన్ని ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు. ఇక అల్లు శిరీష్ నటిస్తున్న తాజా చిత్రం ఇప్పుడు రిలీజ్‌కు రెడీ అవుతోంది. దర్శకుడు రాకేశ్ శశి డైరెక్షన్లో వస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీకి గతంలో ‘ప్రేమ కాదంట’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది.
Allu Sirish: మెగా హీరో అల్లు శిరీష్ ఇటీవల సినిమాల సంఖ్యను చాలా తగ్గించాడు. ఆయన నటించిన ‘ABCD’ మూవీ రిలీజ్ అయ్యి మూడేళ్లు అవుతోంది. ఆ తరువాత శిరీష్ తన నెక్ట్స్ చిత్రాన్ని ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు. అయితే దీనికి కారణం ఆయన నటించిన రీసెంట్ చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవుతుండటమే. దీంతో, తన నెక్ట్స్ మూవీ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు ఈ అల్లు వారి హీరో.
Allu Sirish : అల్లు శిరీష్ కొత్త సినిమా.. ప్రీ – లుక్ అదిరిందిగా..!
ఇక అల్లు శిరీష్ నటిస్తున్న తాజా చిత్రం ఇప్పుడు రిలీజ్‌కు రెడీ అవుతోంది. దర్శకుడు రాకేశ్ శశి డైరెక్షన్లో వస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీకి గతంలో ‘ప్రేమ కాదంట’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది. ఈ సినిమాతో అందాల భామ అను ఇమ్మాన్యుయెల్ కూడా తిరిగి సక్సెస్ అందుకోవాలని పట్టుదలతో ఉంది. ఈ సినిమాపై అమ్మడు భారీ అంచనాలు పెట్టుకుంది. అయితే తాజాగా ఈ సినిమా నుండి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ను చిత్ర యూనిట్ రివీల్ చేశారు. ఈ సినిమా టైటిల్‌ను మార్చేస్తూ.. ‘ఊర్వశివో రాక్షసివో’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లుగా చిత్ర యూనిట్ వెల్లడించింది. అంతేగాక, ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేసేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు.
Prema Kadanta : అల్లు శిరీష్ కొత్త సినిమా ‘ప్రేమ కాదంట’..
ఈ సినిమా టీజర్‌ను సెప్టెంబర్ 29న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. అటు ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలోనూ చిత్ర యూనిట్ ఓ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాను నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది. పూర్తి యూత్‌ఫుల్ సబ్జెక్టుగా ఈ సినిమాను చిత్ర యూనిట్ తెరకెక్కించగా, ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై ధీరజ్ మొగిలినేని ప్రొడ్యూస్ చేస్తుండగా, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని GA2 పిక్చర్స్ బ్యానర్‌పై సమర్పిస్తున్నారు. మరి ఈ సినిమాతో అల్లు శిరీష్ తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.
Presenting you the title & first look of #UrvasivoRakshasivo ~ A modern take on urban relationships.?
Teaser out on Sept 29th ❤️#AlluAravind @AlluSirish @ItsAnuEmmanuel @rakeshsashii @tanvirmir #AchuRajamani @DheeMogilineni #ViijayM @GA2Official
In theaters from Nov 4th!? pic.twitter.com/4YseHZXXDm
— Geetha Arts (@GeethaArts) September 26, 2022