Buddy Song : హమ్మయ్య అల్లు శిరీష్ సినిమా వస్తుంది.. ‘బడ్డీ’ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్..

తాజాగా నేడు బడ్డీ సినిమా నుంచి మొదటి పాటని రిలీజ్ చేసి ఇంకా ఆ సినిమా ఉందని అందరికి గుర్తుచేశారు.

Buddy Song : హమ్మయ్య అల్లు శిరీష్ సినిమా వస్తుంది.. ‘బడ్డీ’ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్..

Allu Sirish Buddy Movie First Song Released

Buddy Movie First Song : అల్లు శిరీష్(Allu Sirish) ఆచితూచి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. రెండేళ్ల క్రితం ఊర్వశివో రాక్షసీవో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి రొమాంటిక్ కామెడీతో మెప్పించాడు శిరీష్. ఆ తర్వాత బడ్డీ అనే ఓ సినిమాని అనౌన్స్ చేసి గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. కానీ మళ్ళీ ఆ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో ఆ సినిమా ఉందా లేదా అని అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. తాజాగా నేడు బడ్డీ సినిమా నుంచి మొదటి పాటని రిలీజ్ చేసి ఇంకా ఆ సినిమా ఉందని అందరికి గుర్తుచేశారు.

Also Read : Double ISMART Teaser : డబల్ ఇస్మార్ట్ టీజర్ వచ్చేసింది.. దిమాక్ కిరికిరి టీజర్ అదుర్స్..

ఆ పిల్ల కనులే.. చూసాక తననే.. అంటూ సాగే ఈ మెలోడీ లవ్ సాంగ్ ని మీరు కూడా వినేయండి. ఈ పాటని సాయి హేమంత్ రాయగా హిప్ హాప్ తమిజా సంగీత దర్శకత్వంలో హిప్ హాప్ తమిజా, ఐరా, సంజీత్ హెగ్డే, విష్ణుప్రియ రవి పాడారు.

తమిళ డైరెక్టర్ సామ్ అంటోన్ దర్శకత్వంలో శిరీష్ ఈ ‘బడ్డీ’ సినిమాతో రాబోతున్నాడు. టెడ్డీ బేర్ తో కలిసి యాక్షన్ సీన్స్ చేయబోతున్నాడు ఈ సినిమాలో. గాయత్రీ భరద్వాజ్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. తమిళ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన స్టూడియో గ్రీన్ బ్యానర్ లో ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ గా నిర్మిస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉందని సమాచారం. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.