Urvasivo Rakshasivo Trailer : ఇన్ని EMIలు ఉన్నోడు ఏ అమ్మాయి గురించి ఆలోచించకూడదు.. ఊర్వశివో రాక్షసివో ట్రైలర్ రిలీజ్..

అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా కొత్త దర్శకుడు రాకేష్ శశి తెరకెక్కించిన సినిమా ఊర్వశివో రాక్షసివో. నవంబర్ 4న ఈ సినిమా గీత ఆర్ట్స్ రిలీజ్ చేయనుంది. ఇప్పటికే టీజర్లో................

Urvasivo Rakshasivo Trailer : ఇన్ని EMIలు ఉన్నోడు ఏ అమ్మాయి గురించి ఆలోచించకూడదు.. ఊర్వశివో రాక్షసివో ట్రైలర్ రిలీజ్..

Allu Sirish Urvasivo Rakshasivo Trailer Released

Updated On : October 31, 2022 / 2:05 PM IST

Urvasivo Rakshasivo Trailer :  అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా కొత్త దర్శకుడు రాకేష్ శశి తెరకెక్కించిన సినిమా ఊర్వశివో రాక్షసివో. నవంబర్ 4న ఈ సినిమా గీత ఆర్ట్స్ రిలీజ్ చేయనుంది. ఇప్పటికే టీజర్లో అను ఇమ్మాన్యుయేల్, అల్లు శిరీష్ మధ్య ముద్దు సీన్లు బాగా చూపించి సినిమాపై అంచనాలు పెంచేశారు. ఆదివారం నాడు ఊర్వశివో రాక్షసివో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా నందమూరి నటసింహం బాలకృష్ణ ముఖ్య అతిధిగా విచ్చేసారు.

తాజాగా ఊర్వశివో రాక్షసివో సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ లో కూడా సరికొత్తగా చూపించారు. ఒకే ఆఫీస్ లో పని చేస్తున్న హీరో, హీరోయిన్స్, వారి మధ్య ప్రేమ, ఈగోలు, రొమాన్స్ లు ఉందనున్నట్టు తెలుస్తుంది. వెన్నెల కిషోర్, సునీల్ కామిడి బాగా పండించినట్టు అర్ధమవుతుంది. ఇన్ని EMIలు ఉన్నోడు ఏ అమ్మాయి గురించి ఆలోచించకూడదు లాంటి పంచ్ డైలాగ్స్ బాగానే ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ట్రైలర్ లో కథ ఏంటో అర్ధం కాకుండా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు. కానీ ఇది ఒక రొమాంటిక్ కామెడీ అని అర్ధమవుతుంది.

Samantha : సమంత వ్యాధిపై నాగబాబు రియాక్షన్.. ఈ జనరేషన్‌లో గ్రేటెస్ట్ యాక్టర్ సమంత..

చాలా గ్యాప్ తర్వాత అల్లు శిరీష్ రొమాంటిక్ కామెడీతో వస్తున్నాడు. దీంట్లో కామెడీ సీన్స్, రొమాన్స్ సీన్స్ ఉండటంతో యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి ఏ రేంజ్ లో ప్రేక్షకులని మెప్పిస్తుందో చూడాలి.