Allu Studios Launch : చిరంజీవి చేతుల మీదుగా అల్లు స్టూడియోస్ గ్రాండ్ లాంచ్..
నేడు అల్లురామలింగయ్య గారి 100వ జయంతి సందర్భంగా కోకాపేటలో నూతనంగా కట్టిన ఈ అల్లుస్టూడియోస్ ని ఉదయం 10 గంటలకు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంకు............

Allu Studios Launch by megastar chiranjeevi
Allu Studios Launch : తెలుగు సినిమాల్లో స్టార్ కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులు, రివార్డులు పొంది తన జీవితాన్ని సినీ పరిశ్రమకి అంకితం చేసిన గొప్ప వ్యక్తి అల్లు రామలింగయ్య. నేడు ఆయన 100వ జయంతి. అల్లు రామలింగయ్య గారి తనయుడిగా అల్లు అరవింద్ స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు. అయన మనవడు అల్లు అర్జున్ స్టార్ హీరోగా ఎదిగాడు. నేడు అల్లురామలింగయ్య గారి 100వ జయంతి సందర్భంగా అల్లు స్టూడియోస్ ని ప్రారంభించనున్నారు.
అల్లు ఫ్యామిలీ గత కొన్ని రోజులుగా అల్లు స్టూడియోస్ నిర్మాణం చేపట్టింది. కోకాపేటలో అల్లు స్టూడియోస్ ని నిర్మిస్తున్నారు. మొత్తం 10ఎకరాల్లో ఈ స్టూడియో నిర్మాణం జరుగుతుంది. ఇప్పటికే ఒక స్టూడియో ఫ్లోర్ పూర్తి అయింది. మరో స్టూడియో ఫ్లోర్ నిర్మాణంలో ఉంది. ముఖ్యంగా ఇండోర్ సినిమా షూటింగ్స్ కోసం ఈ స్టూడియోని నిర్మిస్తున్నారు. భవిష్యత్ లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేసుకోవడానికి కూడా సన్నాహాలు చేస్తున్నారు అల్లు ఫ్యామిలీ.
నేడు అల్లురామలింగయ్య గారి 100వ జయంతి సందర్భంగా కోకాపేటలో నూతనంగా కట్టిన ఈ అల్లుస్టూడియోస్ ని ఉదయం 10 గంటలకు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంకు అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, అభిమానులు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో అల్లు రామలింగయ్య గారికి ఘనంగా నివాళులు అర్పించనున్నారు. ఈ స్టూడియో నిర్మాణంతో హైదరాబాద్ లో సినిమా, టీవీ షూటింగ్స్ కి మరో స్టూడియో అందుబాటులోకి రానుంది.