వెంకీమామ – అల్లుడు బర్త్‌డే గ్లింప్స్ అదిరింది!
విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ నాగచైతన్య మామాఅల్లుళ్లుగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘వెంకీ మామ’ ‘అల్లుడు బర్త్‌డే గ్లింప్స్’ విడుదల..

విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ నాగచైతన్య మామాఅల్లుళ్లుగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘వెంకీ మామ’ ‘అల్లుడు బర్త్‌డే గ్లింప్స్’ విడుదల..
రియల్ లైఫ్ మామాఅల్లుళ్లు విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ నాగచైతన్య రీల్ లైఫ్ మామాఅల్లుళ్లుగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘వెంకీ మామ’..
వెంకీకి జోడిగా పాయల్ రాజ్‌పుత్, చైతుకి జోడిగా రాశీఖన్నా నటిస్తున్నారు. నవంబర్ 23న చైతన్య పుట్టినరోజు సందర్భంగా అక్కినేని అభిమానుల కోసం ఓ స్పెషల్ సర్‌ప్రైజ్ రిలీజ్ చేశారు మూవీ టీమ్. చైతుకిపుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ ‘అల్లుడు బర్త్‌డే గ్లింప్స్’ విడుదల చేశారు.
‘నా మేనల్లుడి లవ్ స్టోరీ టైటానిక్ రేంజ్‌లో ఉంటుందనుకున్నాను.. కనీసం ఊళ్లో పడవ రేంజ్‌లో కూడా లేదురా’.. అని వెంకీ అంటే, ‘నేను మత్తులో ఉండి ఏం చెప్పానో, నువ్వు మందులో ఉండి ఏం విన్నావో.. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి చెప్తా విను’ అంటూ చైతు చెప్పడంతో ఈ గ్లింప్స్ స్టార్ట్ అవుతుంది. ‘నా మేనల్లుడు సార్, వాడిక్కడే మిలటరీలో ఉన్నాడు సార్’ అని వెంకీ, ‘కెప్టెన్ కార్తీక్ శివరామ్.. వీరమాచినేని’ అని ప్రకాష్ రాజ్, ‘వాడు రోజూ దాటే గీత మనం ఒక్కసారి దాటితే ఎలా ఉంటుందో చూపించొస్తాను సార్’ అంటూ చైతన్య చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది.
Read Also : చై బర్త్‌డే – సమంత హార్ట్ టచింగ్ పోస్ట్
చై, రాశీ ఖన్నా కెమిస్ట్రీ బాగుంది. మామా అల్లుళ్ల మధ్య సరదా సంఘటనలు, మనసుని హత్తుకునే సెంటిమెంట్ సీన్స్ సినిమాలో హైలెట్ కానున్నాయట. విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. ఈ గ్లింప్స్ అక్కినేని, దగ్గుబాటి ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. చైతు క్యారెక్టర్‌కి కార్తీక్ బాగా కలిసొచ్చిన పేరు.. ‘ఏమాయ చేశావే’ లో తన క్యారెక్టర్ పేరు కార్తీకే. మళ్లీ ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందని అక్కినేని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.