Naari – The Women : ‘నారి – ది వుమెన్’ రివ్యూ.. మహిళల కష్టాలు చూపిస్తూ మెసేజ్ తో..

రేపు ఉమెన్స్ డే సందర్భంగా నారి సినిమాని నేడు మార్చ్ 7న రిలీజ్ చేసారు.

Naari – The Women : ‘నారి – ది వుమెన్’ రివ్యూ.. మహిళల కష్టాలు చూపిస్తూ మెసేజ్ తో..

Amani Naari The Women Movie Review and Rating

Updated On : March 7, 2025 / 8:08 PM IST

Naari – The Women Movie Review : ఆమని మెయిన్ లీడ్ గా తెరకెక్కిన సినిమా నారి – ది వుమెన్. శశి వంటిపల్లి నిర్మాణంలో సూర్య వంటిపల్లి దర్శకత్వంలో ఈ నారి సినిమా తెరకెక్కింది. వికాస్ వశిష్ఠ, కార్తికేయ దేవ్, నిత్య శ్రీ, మౌనిక రెడ్డి, ప్రగతి, కేదార్ శంకర్, ప్రమోదినీ.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. రేపు ఉమెన్స్ డే సందర్భంగా నారి సినిమాని నేడు మార్చ్ 7న రిలీజ్ చేసారు.

కథ విషయానికొస్తే.. మంత్రి భూపతి(నాగ మహేశ్) కొడుకు తన స్నేహితులతో కలిసి ఓ అమ్మాయిపై అఘాయిత్యం చేస్తారు. ఈ కేసులో నిందితులకు కఠిన శిక్ష వేసేందుకు రెడీ అవుతుంది లాయర్ శారద (ప్రగతి). ఆమెను మంత్రి భయపెట్టినా భయపడదు. ఈ క్రమంలో తన లైఫ్ లో చూసిన భారతి(ఆమని) అనే మహిళ జీవితం గురించి చెప్తుంది. ఇంట్లో ఆడపిల్లని తక్కువగా చూసే తండ్రి చిన్నచూపుతో చిన్నప్పుడు ఇంట్లోనే ఇబ్బందులు పడుతుంది భారతి. తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తుంటే ఇంట్లో నుంచి ప్రేమించిన వాడితో వెళ్లిపోతుంది.

మరి పెళ్లి తర్వాత ఆమె జీవితం ఏమైంది? ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేసింది? తల్లి అయ్యాక ఏం చేసింది? భారతి తన చుట్టూ ఉన్న మహిళలు, ఆడపిల్లల కోసం ఎలాంటి పనులు చేసింది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Anil Sharma : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా వల్ల నా సినిమాకు థియేటర్స్ దొరకలేదు.. బాలీవుడ్ డైరెక్టర్ కామెంట్స్ వైరల్..

సినిమా విశ్లేషణ.. ఓ యువతి రేప్ ఘటనతో నారి మూవీ సీరియస్ గా మొదలవుతుంది. ఆ కేసు కాసేపు సాగి భారతి గురించి లాయర్ శారద చెప్పడంతో అసలు కథ మొదలవుతుంది. ఒక మాములు మిడిల్ క్లాస్ ఇంట్లో పుట్టిన అమ్మాయికి చిన్నప్పట్నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. సమాజంలో కొన్ని చోట్ల జరిగే సంఘటనలు ఆధారంగా తీసుకొని ఓ అమ్మాయి టీనేజ్, పెళ్లి వయసు, తల్లి తర్వాత జీవితం ఎలా ఉంది? ఆ జీవితంలో తాను ఎదుర్కున్న సంఘటనలు ఏంటి అంటూ ఆడవాళ్ళ కష్టాలు చూపించారు.

కథ సీరియస్ గా సాగడంతో కాస్త బోర్ కొట్టినా మధ్యలో లవ్ స్టోరీ, ఓ రొమాంటిక్ సాంగ్ తో రిలీఫ్ ఉంటుంది. మృగాళ్లుగా ప్రవర్తించే కొంతమంది మగాళ్లకు మంచితనం పనికి రాదని, వారిని చట్టం ముందు దోషిగా నిలబెట్టాలని చెప్పే కథాంశంతో రాసుకున్నారు. తప్పు చేసిన వాడు భర్త అయిన, కొడుకు అయినా, బయటి వాడైనా ఒకేలా చూడాలి అనేలా ఓ మెసేజ్ తో రాసుకున్నారు. ఇటీవల చాలా సినిమాల్లో మహిళలపై అఘాయిత్యాలు అనే పాయింట్ ని చూపించినా ఇందులో ఓ కొత్త పరిష్కారాన్ని, కొత్త పాయింట్ ను చూపించాడు డైరెక్టర్. క్లైమాక్స్ మాత్రం అదిరిపోతుంది. సినిమాలో ఎమోషనల్ సీన్స్ చాలానే ఉన్నాయి.

Naari Movie Review

నటీనటుల పర్ఫార్మెన్స్.. ఆమని తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసింది. కొన్ని సీన్స్ లో కన్నీళ్లు పెట్టిస్తుంది. తల్లి పాత్రలో పర్ఫెక్ట్ గా సెట్ అయింది. మౌనిక రెడ్డి క్యూట్ గా నటిస్తూనే ఎమోషన్ సీన్స్ లో మెప్పించింది. నిత్యశ్రీ కూడా ఇంట్లో బాధలు పడే అమ్మాయిగా బాగానే నటించింది. వికాస్ వశిష్ట నెగిటివ్ పాత్రలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఛత్రపతి శేఖర్, కార్తికేయ దేవ్, ప్రగతి, ప్రమోదిని.. ఇలా మిగిలిన నటీనటులు అంతా వారి పాత్రల్లో మెప్పించారు.

Also Read : Kingston : ‘కింగ్‌స్టన్‌’ మూవీ రివ్యూ.. సముద్రంలో హారర్ తో భయపెట్టారుగా..

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. వినోద్ కుమార్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎమోషనల్ సీన్స్ లో మంచి బీజీఎమ్ ఇచ్చారు. ఓ మహిళ ఎలాంటి కష్టాలు పడుతుంది అని మూడు దశల్లో చక్కని స్క్రీన్ ప్లేతో రాసుకొని మంచి మెసేజ్ తో తెరకెక్కించారు డైరెక్టర్ సూర్య వంటిపల్లి. నిర్మాణ పరంగా కూడా మంచి ప్రొడక్షన్ క్వాలిటీస్ మెయింటైన్ చేసి కావాల్సినంత ఖర్చుపెట్టారు నిర్మాత శశి వంటిపల్లి.

మొత్తంగా నారి – ది వుమెన్ సినిమా ఆడవాళ్ళ కష్టాలు, వాళ్లపై జరుగుతున్న అఘాయిత్యాలు, వాటికి ఏం చేయాలి అని ఎమోషనల్ మెసేజ్ ఓరియెంటెడ్ గా తెరకెక్కించారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.