Amaravati JAC:టాలీవుడ్‌ని తాకిన అమరావతి సెగ
తెలుగు హీరోలు అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతు పలకాలని ఫిలించాంబర్ వద్ద అమరావతి పరిరక్షణ విద్యార్థి యువజన జె.ఏ.సి ధర్నా..

Amaravati
Amaravati JAC:తెలుగు హీరోలు అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతు పలకాలని ఫిలించాంబర్ వద్ద అమరావతి పరిరక్షణ విద్యార్థి యువజన జె.ఏ.సి ధర్నా..
తెలుగు చలనచిత్ర పరిశ్రమ అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతు పలకాలని శనివారం ఫిలిం నగర్‌లోని ఫిల్మ్ ఛాంబర్ వద్ద అమరావతి పరిరక్షణ విద్యార్థి యువజన జె.ఏ.సి ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో విద్యార్థి జె. ఏ.సితో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మరియు రైతులు, మహిళ సంఘం సభ్యులు పాల్గొనడం జరిగింది. చిరంజీవి, మోహన్ బాబు, నరేష్, ఎన్టీఆర్, ప్రభాస్, నాని, రాజేంద్రప్రసాద్, రాజమౌళి, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ తదితరుల ఫోటోలతో కూడిన ప్లకార్డులతో చాంబర్ వద్ద ధర్నా చేశారు.
అమరావతి పరిరక్షణ విద్యార్థి యువజన జె.ఏ.సి డిమాండ్స్…
1. సినీ పరిశ్రమ సభ్యులు మద్దతు పలకాలి.
2. సినీ హీరోలు మరి ముఖ్యంగా రైతులకు మద్దతు పలకాలి.
3. తమిళనాడులో జల్లి కట్టు ఉద్యమానికి అక్కడ సినీ హీరోలు ఎలాగైతే తమ మద్దతు తెలిపారో ఇక్కడ కుడా అలానే మద్దతు తెలపాలి.
4. ఎవరయితే మద్దతు తెలుపుతారో వాళ్ళకి మా సపోర్ట్ కచ్చితంగా ఉంటుంది.
5. ఎవరైతే రైతులకు మద్దతు తెలపరో వారి సినిమాలని కచ్చితంగా అడ్డుకొని తిరుతాము అని విద్యార్థి జె.ఏ.సి తెలిపింది.
6. ఎప్పటికైనా సినీ పరిశ్రమ మద్దతు తెలపాలని కోరుకుంటున్నాము.
ఈ మేరకు అమరావతి పరిరక్షణ విద్యార్థి యువజన జె.ఏ.సి ప్రముఖ నిర్మాత కె.ఎల్. దామోదర్ ప్రసాద్‌ని కలిసి వినతిపత్రం అందచేశారు.