Guntur Karam
Guntur Karam : సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ మూవీ ట్రైలర్ దుమ్ము రేపుతోంది. మహేష్ ఫ్యాన్స్‌కి సంక్రాంతి పండుగ ముందుగా వచ్చేసినట్లు అనిపిస్తోంది. అయితే ఈ ట్రైలర్ చూసిన వారంతా ఇప్పుడొక విషయంపై తెగ చర్చించుకుంటున్నారు. గుంటూరు కారం ట్రైలర్‌లో కనిపించిన మహేష్ స్టైల్, మేనరిజం.. అచ్చంగా తలైవర్ రజనీకాంత్ స్టైల్, మేనరిజంకి దగ్గరగా అనిపించింది. గుంటూరు కారంలో ట్రైలర్‌లోని మహేష్ క్లిప్స్‌కి రజనీ కాంత్ క్లిప్స్ యాడ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
12th Fail : 12th ఫెయిల్ సినిమాపై IAS ఆఫీసర్ ట్వీట్.. ఇది మీ సక్సెస్ కాదు..
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్టైల్, మేనరిజంకి పడి చచ్చిపోయే ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన తలపాగా చుట్టుకున్నా.. సిగరెట్ వెలిగించినా.. కన్ను కొట్టినా.. నడిచినా.. కూర్చున్నా.. చేతులు జేబులో పెట్టి నిలుచున్నా అంతా స్టైలే.. ఆయన సినిమాల్లో ఈ ప్రత్యేకత కనిపిస్తుంది. ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ప్రత్యేకమైన స్టైల్. నటనలో.. హావభావాల్లో ఆయనదనే ఇమేజ్ కనిపిస్తుంది. తాజాగా రిలీజైన గుంటూరు కారం సినిమా ట్రైలర్ చూస్తే మహేష్ బాబు పూర్తిగా మాస్ అవతారంలో కనిపించారు. అయితే ఈ ట్రైలర్‌లో ఆసక్తికరమైన అంశాలు కనిపించాయి.
Guntur Kaaram : గుంటూరు కారం రన్ టైం ఎంతో తెలుసా..? సెన్సార్ సర్టిఫికెట్ ఏంటి..?
రజనీకాంత్ స్టైల్‌కి దగ్గరగా మహేష్ బాబు సీన్స్ గుంటూరు కారం ట్రైలర్‌లో కనిపించడం ఇంట్రెస్టింగ్ కలిగించింది. ఒక అభిమాని ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియోలో రజనీ కాంత్, మహేష్ బాబు ఒకేలా నటించిన సీన్స్ యాడ్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసారు. అదరహో అనిపిస్తున్న ఈ వీడియో చూసి ఇద్దరు సూపర్ స్టార్ల ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇద్దరు అమేజింగ్ సూపర్ స్టార్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక గుంటూరు కారం సినిమా జనవరి 12 న సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందించారు.
Super Stars!!⭐?@urstrulyMahesh@rajinikanth#GunturKaaramTrailer#GunturKaaram#GunturKaaramTrailerExplosion https://t.co/4dZL6Pfnwq pic.twitter.com/ZEBir95EHT
— Vajrang ?️ (@UrsVajrang) January 8, 2024