Guntur Kaaram : గుంటూరు కారం రన్ టైం ఎంతో తెలుసా..? సెన్సార్ సర్టిఫికెట్ ఏంటి..?

మహేష్ బాబు గుంటూరు కారం రన్ టైం ఎంత..? సెన్సార్ బోర్డు మూవీ ఏ సర్టిఫికెట్ ఇచ్చింది..?

Guntur Kaaram : గుంటూరు కారం రన్ టైం ఎంతో తెలుసా..? సెన్సార్ సర్టిఫికెట్ ఏంటి..?

Mahesh Babu Guntur Kaaram Run Time and censor board details

Updated On : January 8, 2024 / 8:00 PM IST

Guntur Kaaram : మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో సినిమాగా వస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’. మహేష్ ఇప్పటివరకు కనిపించినంత మాస్ రోల్‌లో ఈ మూవీలో కనిపించబోతున్నారు. దీంతో అభిమానుల్లో మూవీ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ తో ఆ అంచనాలు మరింత పెరిగిపోయాయి. దీంతో ఫ్యాన్స్ అంతా ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు.

షూటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ శుక్రవారం 12వ తారీఖున గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ సర్టిఫికెట్ పనులను కూడా కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రాన్ని UA సర్టిఫికెట్ ఇచ్చింది. ఇక ఈ మూవీ రన్ టైం విషయానికి వస్తే.. 2 గంటల 39 నిముషాలు నిడివితో ఆడియన్స్ ముందుకు వస్తుంది.

Also read : Fighter : హృతిక్ ‘ఫైటర్’ నుంచి ‘హీర్ ఆస్మాని’ సాంగ్ రిలీజ్..

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించిన అప్డేట్ ని కూడా నేడు తెలియజేశారు. మొన్న జనవరి 6నే గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరగాల్సి ఉంది. కానీ భద్రతా సమస్యలు వల్ల ఆ ఈవెంట్ పోస్టుపోన్ అయ్యింది. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని రేపు జనవరి 9న గుంటూరులో నిర్వహించబోతున్నారు. గుంటూరులోని నంబూరు ఎక్స్ రోడ్ వద్ద ఉన్న భారత్ పెట్రోల్ బ్యాంకు పక్కనున్న ఖాళీ స్థలంలో ఈ ఈవెంట్ చేయబోతున్నారు.

నిన్న జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌నే ఒక పండుగలా చేసిన మహేష్ ఫ్యాన్స్.. రేపు జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తమ సందడితో జాతర చేయడానికి సిద్ధమవుతున్నారు. కాగా ఈ ప్రీ రిలీజ్ ని అమెరికా థియేటర్స్ లో లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వబోతున్నట్లు నిర్మాతలు మొన్ననే ప్రకటించారు. కాలిఫోర్నియా సినీ లాంజ్ ఫ్రీమాంట్ సెవెన్ సినిమాస్ లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ స్ట్రీమ్ చేయబోతున్నారు. ఇలా ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అమెరికాలో లైవ్ ఇవ్వడం ఇదే మొదటిసారి. దీంతో అక్కడి అభిమానులు రేపు సందడి చేయబోతున్నారు.