Fighter : హృతిక్ ‘ఫైటర్’ నుంచి ‘హీర్ ఆస్మాని’ సాంగ్ రిలీజ్..
హృతిక్ రోషన్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఫైటర్’ నుంచి 'హీర్ ఆస్మాని' సాంగ్ రిలీజ్ అయ్యింది.

Heer Aasmani song released from Hrithik Roshan Deepika Padukone Fighter Movie
Fighter : బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఫైటర్’. గతంలో హృతిక్ రోషన్ తో ‘వార్’, ‘బ్యాంగ్ బ్యాంగ్’ వంటి సినిమాలు తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్న సిద్దార్థ్ ఆనంద్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా ఈ దర్శకుడు ‘పఠాన్’ లాంటి బ్లాక్ బస్టర్ ని అందుకోవడంతో.. ఇప్పుడు ఫైటర్ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యేలా చేసింది. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ని జరుపుకుంటుంది.
ఇక రిలీజ్ దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో సందడి చేస్తుంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా.. మూవీ టీజర్ అండ్ సాంగ్స్ ని రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రెండు సాంగ్స్ ని రిలీజ్ చేసి ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. తాజాగా మూడో సాంగ్ ని కూడా రిలీజ్ చేశారు. ‘హీర్ ఆస్మాని’ అంటూ సాగే సాంగ్ స్టోరీ నేపథ్యంతో ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సాంగ్ అందర్నీ ఆకట్టుకుంది.
Also read : 12th Fail : 12th ఫెయిల్ సినిమాపై IAS ఆఫీసర్ ట్వీట్.. ఇది మీ సక్సెస్ కాదు..
విశాల్ శేఖర్ సంగీతం అందిస్తున్నారు. కాగా ప్రస్తుతం హిందీ వెర్షన్ సాంగ్స్ ని మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. గతంలో సిద్దార్థ్ ఆనంద్, హృతిక్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్యాంగ్ బ్యాంగ్, వార్ చిత్రాలను తెలుగులో డబ్ చేసినట్లే ఫైటర్ ని కూడా డబ్ చేయనున్నారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంటే అనిల్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
వయాకామ్ 18 స్టూడియోస్, మార్ ఫ్లిక్స్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంతో ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. మరి ‘వార్’, ‘బ్యాంగ్ బ్యాంగ్’ చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ ని అందుకున్న ఈ కాంబినేషన్.. మరో హిట్టుని అందుకొని హ్యాట్రిక్ కాంబినేషన్ అనిపించుకుంటుందేమో చూడాలి.