Rashmika Mandanna: అమితాబ్ మాట వినని రష్మిక.. గుడ్‌బాయ్ అంటున్న బాలీవుడ్

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, నేషనల్ క్రష్ రష్మికా మందన్న కలయికల తెరకెక్కుతున్న బాలీవుడ్ ఫామిలీ-కామెడీ డ్రామా చిత్రం "గుడ్ బాయ్". వికాస్ బాల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. దింతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ లో వేగం పెంచారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఈ సినిమా సంబందించిన ట్రైలర్ ను విడుదల చేసింది.

Rashmika Mandanna: అమితాబ్ మాట వినని రష్మిక.. గుడ్‌బాయ్ అంటున్న బాలీవుడ్

Amitabh and Rashmika's Good Bye Trailer Released

Updated On : September 6, 2022 / 9:01 PM IST

Rashmika Mandanna: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, నేషనల్ క్రష్ రష్మికా మందన్న కలయికల తెరకెక్కుతున్న బాలీవుడ్ ఫామిలీ-కామెడీ డ్రామా చిత్రం “గుడ్ బాయ్”. వికాస్ బాల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. దింతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ లో వేగం పెంచారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఈ సినిమా సంబందించిన ట్రైలర్ ను విడుదల చేసింది.

Rashmika Mandana : టైగర్‌ ష్రాఫ్‌ పై రష్మిక అభిమానులు ఆగ్రహం..ఎందుకు?

ఈ సినిమాతో బాలీవుడ్ కి స్ట్రెయిట్ ఎంట్రీ ఇస్తున్న రష్మికకు అమితాబ్ తండ్రిగా నటిస్తుండగా, తల్లిగా నీనా గుప్త, సోదరులుగా సునీల్ గ్రోవర్, పావైల్ గులాటి వంటి నటీనటులు కనిపించనున్నారు. ట్రైలర్ బట్టి చుస్తే రష్మిక తల్లి(నీనా గుప్త) చనిపోవడంతో విదేశాల్లో ఉన్న కొడుకులే వచ్చి అంతిక్రియలు చేయాలంటూ ఎదురుచూసే తండ్రి(అమితాబ్) కధాంశంతో ఈ సినిమా నడవబోతున్నట్టు తెలుస్తుంది.

హిందూ సంప్రదాయాలు-పద్ధతులు పాటించే అమితాబ్, అవేవి నమ్మకుండా తన కాళ్లపై తను బతుకుతూ ఇండిపెండెంట్ గా జీవించే రష్మికల మధ్య వాగ్వాదం. తల్లి అంతిక్రియలకు రాకుండా తప్పించుకుని తిరిగే కొడుకుల డ్రామాలకు కాస్త నవ్వులు జతకూర్చి రియాలిటీకి దగ్గరగా చూపిస్తూ డైరెక్టర్ ప్రేక్షకులను ఎమోషనల్ రోలర్ కోస్టర్ ఎక్కించబోతున్నట్టు ట్రైలర్ లో కనిపిస్తుంది. ఈ సినిమాతో రష్మిక ఎంతటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి.