Amitabh Bachchan : ప్రభాస్ సెట్‌లో అందరి కాళ్ళకి దండం పెడతాడు.. అమితాబ్ కాళ్లకు దండం పెట్టినప్పుడు..
అమితాబ్ ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. సెట్ లో అందరి కాళ్లకు నమస్కారం చేస్తాడు అని తెలిపారు.

Amitabh Bachchan interesting Comments on Prabhas in Kalki Pre Release Event
Amitabh Bachchan : ప్రభాస్ జూన్ 27న కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతున్న ఈ సినిమా కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ముంబైలో కల్కి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్ కి ప్రభాస్, దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రానా, నిర్మాత అశ్వినీదత్ హాజరయ్యారు.
ముంబైలో జరిగిన కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్లో రానా.. ప్రభాస్, అమితాబ్, కమల్, దీపికాలను ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూ సరదాగా సాగింది. అయితే ఈ ఇంటర్వ్యూలో అమితాబ్ ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. సెట్ లో అందరి కాళ్లకు నమస్కారం చేస్తాడు అని తెలిపారు. అంటే సెట్ లో తన కంటే పెద్ద వాళ్లకు ప్రభాస్ కాళ్లకు నమస్కరిస్తాడు అని తెలిపారు.
ప్రభాస్ దీని గురించి మాట్లాడుతూ.. అమితాబ్ సర్ కాళ్ళకి నమస్కారం చేస్తే, నువ్వు ఇలా చేయొద్దు, నువ్వు చేస్తే నేను కూడా నీ కాళ్లకు నమస్కారం పెడతాను అన్నారు. నేను వద్దు సర్ అంటూ ఆపేసాను అని తెలిపాడు. దీంతో అమితాబ్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ప్రభాస్ మర్యాద గురించి అందరికి తెలిసిందే. ఇప్పుడు అమితాబ్ వల్ల ప్రభాస్ షూటింగ్ లో కూడా తన కంటే పెద్ద వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేస్తాడని తెలిసింది. దీంతో మరోసారి ప్రభాస్ ని అభినందిస్తున్నారు.